తెలుగు చలన చిత్ర రంగంలో స్వయంకృషితో.. ఎన్నో అవరోధాలు అధిగమిస్తూ.. కష్టపడి పైకి వచ్చిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.. అప్పట్లో తెలుగు చలన చిత్రం అంటే ఎన్టీఆర్,ఏఎన్ఆర్ ల పేరు మాత్రమే వినిపించేది.. ఎనభైవ దశకంలో ఆ పేర్ల తర్వాత చిరంజీవి అనే పేరు మాత్రమే వినే స్థాయికి ఎదిగిన నటుడు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి వారసులుగా పవన్ కళ్యాన్,రాంచరణ్,అల్లు అర్జున్,సాయిధరమ్ తేజ్,వరుణ్ తేజ్ వచ్చారు. మెగాస్టార్ వారసులు అంటే అన్నిరంగాల్లో ఆరితేరినవారై ఉండాల్సి ఉంటుంది.. అంటే డ్యాన్స్, ఫైట్స్,యాక్షన్,కామెడీ అన్ని కలబోసినట్లు ఉంటేనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతారు.. వాస్తవానికి ఇప్పటి వరకు వచ్చిన హీరోలకు అన్ని క్వాలిటీలు ఉన్నవారే వెండితెరకు పరిచయం అయ్యారు. 


తాజాగా చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ‘రేయ్’చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యాడు..కానీ ఆ సినిమాకు ముందే..పిల్లా నువ్వు లేని జీవితం సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సినిమా పాజిటీవ్ టాక్ వచ్చింది..తాజాగా  సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్'   సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా రూపొందుతున్న చిత్రం'సుబ్రమణ్యం ఫర్ సేల్'  త్వరాలో రిలీజ్ కాబోతుంది.


 ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లీక్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఈ మద్య సినిమాలు రాక ముందే స్టోరీలైన్ లీక్ కావడం కామన్ అయ్యింది. ఇక కథ విషయానికి వస్తే.. ఇందులో రెండు సినిమాలు కలిసి నడిచే స్టోరీ అట.. ఒకటి చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ రెండోది ‘బృందావనం’ ఈ కథల సారాంశ ఏమిటంటే హీరో (సాయిధరమ్ తేజ్) డబ్బు కోసం ఏ పనైనా చేసే రకం ఎంతటి సాహసానికైనే తెగించే నైజం గల వాడు.. అయితే ప్రేయసి (రెజీనా) కోసం తనకు ఇచ్చిన మాట కోసం ఒక ఊరికి వెళతాడు.. అక్కడ మరో హీరోయిన్ (అదాశర్మ) కలుస్తుంది.


'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రం పోస్టర్


ఆ ఊరిలో మన హీరో చేసే ఘనకార్యాలు.. ఆదే ఊరికి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ (రెజీనా) మరో హీరోయిన్ (అధా శర్మ) ల మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలతో సినిమా స్టోరీ నడుస్తుందిట.. సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌ 


మరింత సమాచారం తెలుసుకోండి: