సూపర్ స్టార్ క్రుష్ణ కొడుకిగా మహేష్ బాబు సినిమా ఆఫర్స్ ని కెరీర్ మొదట్లో తెచ్చుకున్నాడు. ఆ తరువాత తనదైన శైలితో తన కంటూ ఓ సపరేట్ స్టార్ డంని క్రియేట్ చేసుకోగలిగాడు. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్. అలాగే ఎండోర్స్ మెంట్ విషయంలో మహేష్ బాబే నెంబర్ వన్.

మహేష్ బాబుకి కొన్ని సంవత్సరాల క్రితం మూవీలు బాక్సాపీస్ వద్ద అట్టప్లాప్ గా నిలిచినా, తనకి వచ్చే ఎండోర్స్ మెంట్ ఆఫర్స్ మాత్రం ఎక్కడా ఆగలేదు. ప్రతి సంవత్సరం మహేష్ బాబు రెండు కొత్త బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఎన్నుకొడుతున్నాడు. దీంతో ప్రస్తుతం మహేష్ బాబు దాదాపు 8 బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కంటిన్యూ అవుతున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా మరో యంగ్ హీరో తన మొదటి మూవీ రిలీజ్ కాక ముందే 3 బ్రాండ్స్ కి అంబాసిడర్ లాగా కొనసాగుతున్నాడు. త్వరలోనే మహేష్ బాబుకి కాంపీటీషన్ ఇచ్చే హీరో తనే అని యాడ్ మార్కెట్ సైతం నమ్ముతుంది. ఇప్పటి 3 బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కొనసాగిన ఆ హీరోనే అక్కినేని అఖిల్. అవును, అక్కినేని అఖిల్ స్టార్  యాక్టర్ నాగార్జున బ్యాక్ గ్రౌండ్ తో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రి ఇస్తున్నప్పటికీ, మొదటి మూవీ అఖిల్ తో తన కంటూ ఓ సరరేట్ ఫ్లాట్ ఫాంని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

అఖిల్ ఇప్పటి వరకూ టైటాన్, బేవరేజ్ బ్రండ్ అయిన మౌంటేన్ డ్యూ అలాగే ఇప్పుడు కార్బన్ మొబైల్స్ కి అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా 3 సంవత్సరాల పాటు కార్బన్ మొబైల్స్ కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగేందుకు సైన్ చేశాడు. కార్బన్ మొబైల్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్, అలాగే బ్రాండ్ యాక్టివిటీస్ కి అఖిల్ సేవలందించాల్సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: