గత కొంత కాలంగా టాలీవుడ్ లో వరుసగా బ్లాక్ బస్టర్ మూవీలే. అయితే యంగ్ హీరోల మధ్య ఆసక్తికరమైన బిగ్ ఫైట్ ఇప్పటి వరకూ జరగలేదు. కానీ తాజాగా ఈ శుక్రవారం ఇద్దరు యంగ్ హీరోల మధ్య బిగ్ బాక్సాపీస్ ఫైట్ జరగనుంది. వారే నాని, మంచి విష్ణు. నాని హీరోగా ‘భలే భలే మగాడివోయ్’.. విష్ణు హీరోగా ‘డైనమైట్’ సినిమాలు రానున్నాయి. 

ఈ మూవీస్‌ను ఇన్ డైరెక్ట్‌ ‌గా దర్శకులు మారుతి వర్సెస్ దేవ కట్టా మధ్య ఫైట్‌గానే కొందరు మాట్లాడుకుంటున్నారు. భలే భలే మగాడివోయ్ సినిమాకి మెగా బ్యానర్ సపోర్ట్ ఉంటూ, ఇప్పటి తనదైన ప్రమోషన్ యాక్టివిటీస్ తో ప్రేక్షకుల్లోకి సినిమాని తీసుకుపోగలిగింది.

అలాగే మరోవైపు డైనమైట్ అంటూ మంచు విష్ణు సైతం ఈసారి సరికొత్త లుక్ కనిపిస్తూ ప్రేక్షకుల ద్రుష్టిని ఆకట్టుకోగలిగాడు. భలేభలే మగాడిగా నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడనే కాన్ఫిడెంట్ ఇండస్ట్రీలో ఉన్నట్టు తెలుస్తుంది.  అలాగే, తమిళంలో హిట్టయిన ‘అరిమ నంబి’ని తెలుగులో రీమేక్ చేసిన డైనమైట్ పూర్తిగా థ్రిల్లర్, యాక్షన్ సినిమా అని చెప్పనవసరంలేదు.

దేవకట్టా తనదైన శైలిలో ఈ మూవీని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. దేవకట్టా కి మంచి బ్రాండ్ ఉండటంతో డైనమైన్ మూవీ సైతం బాక్సాపీస్ వద్ద సక్సెస్ గా నిలుస్తుందని అంటున్నారు. మొత్తంగా ఈ శుక్రవారం రెండు సినిమాలు పాజిటివ్ టాక్స్ తో రిలీజ్ అవ్వటం అనేది...ఇద్దరి హీరోలకి శుభపరిణామం అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: