ఈమధ్య కాలంలో మన టాప్ యంగ్ హీరోలు ముంబాయి రియల్ ఎస్టేట్ పై బాగ కన్నువేసారు. కొంత కాలం క్రితం రామ్ చరణ్ జoజీర్  సినిమాలో నటిస్తున్నప్పుడు ముంబాయిలో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ కొన్నాడు. ఇప్పుడు చెర్రీ అడుగు జాడల్లో  నడుస్తూ  బన్నీ కూడ ఒక  ఖరీదైన అపార్ట్ మెంట్ ను ముంబాయిలో కొని అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఈ అపార్ట్ మెంట్ విషయంలో అల్లుఅర్జున్ విభిన్నంగా ప్రవర్తించాడు.

తన అభిరుచులకు అణుగుణంగా ఇంటీరియర్ డిజైనింగ్ చేయబడిన ఈఅపార్ట్ మెంట్ వ్యవహారంలో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ అపార్ట్ మెంట్ ఇంటీరియర్ డిజైనింగ్ వ్యహారoలో  అల్లుఅర్జున్ ఇంటీరియర్ డిజైనర్స్ సాయం తీసుకోలేదట. అంతేకాదు ఈఅపార్ట్ మెంట్ ఇంటీరియర్ డిజైనింగ్ అంతా తనకు తానే ఆలోచించి ప్రతిరూమ్ ఇంటీరియర్ డిజైన్ చేసుకున్నాడట. ఈ పనులు అన్ని కేవలం పది రోజుల్లో దగ్గర ఉండి పూర్తి చేసుకున్నాడట.

 ఈ విషయాలు అన్ని బన్నీ సోదరుడు అల్లు శిరీష్ తన ట్విట్టర్ లో బయట పెట్టడమే కాకుండా ఆ అపార్ట్ మెంట్ లో బన్నీ డిజైన్ చేసిన అందమైన ఇంటీరియర్ ఫోటోలు కూడా తన ట్విట్టర్ లో పెట్టాడు. ఇప్పటికే టాప్ యంగ్ హీరో గా ఒక రేంజ్ కి ఎదిగిన బన్నీ ఇక నటుడుగానే కాకుండా  తన మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఇంటీరియర్ డిజైనర్ గా సలహాలు ఇవ్వవచ్చు అంటూ ఈఫోటోలు చూసిన వారు కామెంట్  చేస్తున్నారు. 

 తాను నటించే సినిమా పాత్రల ఎంపికలోనే కాకుండా ప్రతివిషయంలో  వైవిధ్యంగా కనిపించడం బన్నీ ప్రత్యేకత. ప్రతీ విషయాన్ని బిజినెస్ గా మార్చడంలో దిట్ట అయిన అల్లుఅరవింద్ తన కొడుకు టాలెంట్ బయటకు వచ్చింది కాబట్టి  ఈ టాలెంట్ ను బిజినెస్ గా ఎలా మారుస్తాడో చూడాలి... 


మరింత సమాచారం తెలుసుకోండి: