తెలుగు ఇండస్ట్రీలో తన వెరైటీ చెష్టలతో తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న కామెడీ యాక్టర్ సంపూర్నేష్ బాబు ‘బాహుబలి’ ఫ్యాన్స్ కి సారీ చెప్పాడు. తెలుగు చలన చిత్ర చరిత్రలో దర్శకుడు రాజమౌళి నిర్మించిన బాహుబలి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచ స్థాయిలో తెలియజేసిన చిత్రం నాలుగు భాషల్లో విడుదలై అక్కడ ఇండస్ట్రీల్లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులు తిరగరాసిన చిత్రం ‘బాహుబలి’.

ఇక ‘హృదయకాలేయం’ చిత్రంతో బర్నింగ్ స్టార్ గా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం ‘కొబ్బరిమట్ట’ పోస్టర్ ఈ మద్య విడుదలైంది. ఆ పోస్టర్ లో సంపూ చిన్నాపిల్లాడిలా రెండు చేతుల ఎత్తుకొని ఉన్న చిత్రం చూస్తుంటే..అందరూ పగలబడి నవ్వుకున్నారు.   తెలుగు సినిమాలకు మంచి గుర్తింపు తెచ్చిన బాహుబలి సినిమా మోషన్ పోస్టర్ ని కాపీ కోట్టడంతో రాజమౌళి ఫ్యాన్స్ అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడ్డారు.

కొబ్బరి మట్ట చిత్రంలో సంపూర్నేష్ బాబు


అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిన బాహుబలి పోస్టర్ తో సంపూ పోస్టర్ ని పోల్చడం బాహుబలి అభిమానులకు బాధకలిగించింది. ఇక సంపూర్నేష్ బాబు పై విపరీతమైన విమర్శలు గుప్పించారు. తప్పు తెలుసుకున్న సంపూ రాజమౌళి,ప్రభాస్ కి క్షమాపణ చెప్పారు.  సంపూ క్షమాణలు చెప్పడంతో రాజమౌళి ,ప్రభాస్ అభిమానులు శాంతించి, సంతోషం వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: