రేపు విడుదల కాబోతున్న ‘భలే భలే మగాడివోయ్’ సినిమా రిజల్ట్  గురించి నాని చాల ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. మన ఇరు రాష్ట్రాలతో పాటు మిగతా ప్రాంతాలతో కలుపుకుని సుమారు 700 ధియేటర్లలో ఈసినిమా విడుదల అవుతోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరో నటించని మతి మరుపు పాత్రను నాని ఈసినిమాలో పోషిస్తున్నాడు. సినిమా విడుదల కాకుండానే ఈ సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడం నాని అదృష్టం అని అంటున్నారు. 

ఈ సినిమా ప్రమోషన్ కు సంబంధించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న నాని ఒక ఆ సక్తికర విషయాన్ని బయట పెట్టాడు. ఈ సినిమాలోని హీరో పాత్రలాగే తనకు కూడ కొంచెం మతిమరుపు ఉందని అయితే ఆ విషయం బయట పడకుండా తాను మేనేజ్ చేస్తూ ఉంటానని తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు. అంతేకాదు తన సోదరి తనను ముద్దుగా ‘మల్టీప్లెక్స్’ అంటూ నిక్ నేమ్ తో పిలుస్తూ ఉంటుందని దీనికి కారణం తాను తన ఆలోచనలను ఒక విషయం నుండి మరొక విషయానికి స్పీడ్ గా మళ్ళిస్తూ ఉంటాను కాబట్టి తనకు తన సోదరి ఈ నిక్ నేమ్ పెట్టింది అని వివరించాడు నాని.

అంతేకాదు నానీకి సినిమా రంగంలో ఎంతోమంది తెలిసినా వారి పేర్లు అన్నీ పూర్తిగా నానీకి జ్ఞాపకం ఉండవట. అందువల్ల ఆ వ్యక్తులు ఎదురు పాడినప్పుడు వారి పేర్లు తనకు గుర్తు లేకపోయినా వారి ముఖాలను బట్టి గుర్తుపట్టి నవ్వుతూ తెలివిగా మేనేజ్ చేస్తాను అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు నాని. 

తన మనస్తత్వానికి బాగా దగ్గరైన పాత్ర కాబట్టి ఈ మతిమరుపు పాత్రలో చాల సహజంగా నటించాను అని అంటున్నాడు నాని. వరస పరాజయాల తరువాత నానీ నటించిన ఈ సినిమా విజయవంతం కావడం నాని కెరియర్ కు చాల అవసరం. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బూతు సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన మారుతీ ఈ సినిమాలో ఒక్క అశ్లీల డైలాగ్ కూడా లేకుండా తీయడమే కాకుండా ఈసినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ సెన్సార్ నుండి పొందటం మరొక ట్విస్ట్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: