మెగా ఫ్యామిలీని అమితంగా అభిమానించే వారిలో బండ్ల గణేష్ ఒకడు. ఎక్కడ ఉన్నా సరే, వేదిక ఏదైనా సరే మెగా హీరోలు కనబడగానే గణేష్ అమాంతం కాళ్ళ మీద పడటానికి కూడా సంకోచించడు. దశాబ్దకాలం దాకా చిన్న చిన్న వేశాలు వేసుకుంటూ కామెడీ ఆర్టిస్ట్ గా ఉన్న గణేష్ కాస్త సడెన్ గా ప్రొడ్యూసర్ అయ్యాడు. అయితే పేరుకి ప్రొడ్యూసరే అయినా మెగా ఫ్యామిలీ విషయానికొస్తే మాత్రం తాను ఒక అభిమానిగా మారతాడు.

 

చిరు బర్త్ డే పార్టీ ఈవెంట్ కి తనకి కూడా ఇన్విటేషన్ పంపినందుకు హ్యాపీగా ఫీల్ అయిన బండ్ల గణేష్ ఆ పార్టీలో కూడా మెగా అభిమానాన్ని చాటాడు. ఇక లేటెస్ట్ గా చిరు తన బర్త్ డే పార్టీకి వచ్చిన అథిదులందరికి థాంక్స్ తెలుపుకుంటూ ఒక లెటర్ ని పంపించాడట. అందరితో పాటు ఆ లెటర్ ని బండ్ల కూడా అందుకోవడం విశేషం. బర్త్ డే పార్టీకి అటెండ్ అయిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి మరియు వెల్ విషర్స్ కి లెటర్ ద్వారా తన కృతజ్ఞతలను తెలిపాడు చిరంజీవి.

 

చిరంజీవి పంపిన థాంక్స్ లెటర్ :

 

తన 60వ పుట్టినరోజు పార్టీకి వచ్చి దాన్ని చాలా ప్రత్యేకం చేశారు, దానికి మీ అందరికి థాంక్స్ అంటూ, మీలాంటి ఫ్రెండ్స్, వెల్ విషర్స్ జర్నీలో తోడయినందుకు హ్యాపీగా అని చెబుతూ.. అందుకే అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను’ అని ఒక లెటర్ ని పంపించారట మెగాస్టార్ చిరంజీవి. ఇకా ఈ లెటర్ ని కాస్త ట్విట్టర్ లో పోస్ట్ చేసి ‘మా అన్నయ్య.. సంస్కారానికి పాధాభివందనం చేస్తున్నా అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు బండ్ల గణేష్.

 

బండ్ల ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బర్త్ డే పార్టీకి వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి చిరంజీవి ఇలా లెటర్ ని పంపడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు వాట్ యాన్ ఐడియా మెగాస్టార్ జి అని అనుకుంటున్న వారు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: