తెలుగు తెరపైకి కొత్త తరం వారుసులు వస్తున్నారు. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నాడంటూ కొద్దిరోజులుగా చాలా వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ ఇప్పటివరకు రాలేదు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోయే సినిమాకు డైరెక్టర్ ఫైనలైజ్ అయినట్టు సమాచారం..  బాలకృష్ణ ప్రస్తుతం తన 98 వ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. బాలయ్య వందో సినిమాను కూడా బోయపాటే డైరెక్ట్ చేయనున్నట్టు టాక్.

బాలయ్య వందో సినిమాలో కూడా మోక్షజ్ఞ కనిపించనున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే నాగార్జున తనయుడు అఖిల్ ను హీరోగా అఖిల్ సినిమాతో పరిచయం చేస్తున్నాడు. ఇక మోక్షజ్ఞ కు అన్ని రకాల ట్రైనింగ్ లు ఇప్పించారు కూడా. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. అయితే అఖిల్ హీరోగా పరిచయం అయ్యే సినిమాకు భారి క్రేజ్ రావడం తో పాటు భారి బిజినెస్ చేసి అప్పుడే యాభై కోట్ల మార్కెట్ ను చేరుకున్న నేపద్యం లో ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా భారిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ


నందమూరి కుర్రాడు కాబట్టి మాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా రఫ్ అండ్ టఫ్ గా ఉండాలి అందుకే బాలయ్య తన కొడుకును మాస్ ఓరియెంటెడ్ గా ఉన్న కథతో ఎంట్రీ ఇప్పిస్తారని టాలీవుడ్ వర్గం అనుకుంటున్నారు. మరి ఈ సినిమాకు దర్శకుడు ఎవరు ? ఎ బ్యానర్ లో వస్తుంది అనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తారట !



మరింత సమాచారం తెలుసుకోండి: