సొంతం,జెమినీ సిినిమాల్లో నాజూగ్గా కనిపించిన సుందరి ‘సింహ’ సిినిమాలో బాలయ్య పక్కన ‘సింహ మంటీ చిన్నోడే’ అంటూ బొద్దుగా కనిపించిన అమ్మడు ఇప్పుడు అందరికీ షాకింగ్ న్యూస్ ఇచ్చింది..ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటారా.. నమిత. అవునండీ మీరు వింటుంది నిజమే.. నమిత త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించింది..తెలుగు, తమిళ సినిమాల్లో తన అందాలతో అదరగొట్టిన అందాల నటి   ఇక ఆమె తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.

నాకు ప్రత్యేకతను ప్రసాదించింది తమిళ ప్రేక్షకులు. గుర్తింపునిచ్చింది తమిళులు. అందుకే తమిళ ప్రజలకు మంచి చేసేందుకైనా రాజకీయాల్లోకి వస్తాను.తనది గుజరాత్‌ అయినా... తమిళనాడు సరికొత్త జన్మనిచ్చిందని అన్నారు.  తన జీవితం ఈ రాష్ట్రానికే అంకితం చేయనున్నట్లు వివరించారు. పలు రాజకీయ పార్టీల నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని, అయితే ఎవరు పిలిచారన్నది ఇప్పుడు చెప్పనని ఆమె అన్నారు.

ఇప్పుడు స్లిమ్‌గా తయారై మీ అందరికీ (మీడియా) ఎలా షాకిచ్చానో, వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ షాకివ్వబోతున్నానని చెప్పారు. అయితే రాజకీయంగా ఏ పార్టీ తీర్ధం పుచ్చుకోబోతున్నారన్న విషయం మాత్రం వెల్లబుచ్చలేదు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు రాజకీయ రంగంలోకి రావడం కామన్ అయినా.. అందాల ఆరబోతతో కుర్రకారుకి పిచ్చెక్కించిన నమిత ఇంత తొందరగా రాజకీయాల్లోకి రావడమా అని అందరూ ఆశ్చర్య పోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: