కొన్ని కాంబినేషన్లలో సినిమా వస్తుందంటే ఆ సినిమా కచ్చితంగా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందని డిసైడ్ అయిపోతారు ఆడియెన్స్. ప్రస్తుతం డైరక్టర్ త్రివిక్రమ్, ప్రొడ్యూసర్ రాధాకృష్ణల కాంబో కూడా అంతే సూపర్ క్రేజ్ సంపాధించింది. హారిక & హాసిని క్రియేషన్స్ ద్వారా రాధకృష్ణ నిర్మాణ సారధ్యంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. అయితే ఇప్పుడు వీరిద్దరు కలిసి హ్యాట్రిక్ హిట్ పై కన్నేసినట్టు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ తీస్తున్న నితిన్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు రాధాకృష్ణ.

 

నితిన్ సమంత మొట్ట మొదటిసారి జోడీ కడుతున్న ఈ సినిమాతో మరోసారి తన మాటలతో మ్యాజిక్ చేయనున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నితిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడం ఇదే మొదటిసారి. ఇక తన సినిమాల్లో హీరోయిన్ గా సమంతను తప్పితే వేరే హీరోయిన్ ని ఇప్పుడప్పుడే మార్చేలా లేడు త్రివిక్రమ్. సమంతతో అలా సింక్ కుదిరింది మాటల మాంత్రికుడికి. 

 

అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నితిన్ సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు తివిక్రమ్ కూడా నిర్మాణ భాధ్యతలను మీద వేసుకోబోతున్నాడని టాక్. ఇక తను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయితే కనుక కచ్చితంగా త్రివిక్రమ్ ఈ సినిమాను ఎలాగైనా ప్రేక్షకాదరణ పొందేలా చేసుకుంటాడు.

 

మొత్తానికి త్రివిక్రమ్ ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారబోతున్నడన్నమాట. అదీగాక ఈ దర్శక నిర్మాతలిద్దరు కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే డెడికేషన్ తో పనిచేస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వని ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: