హీరోతో ముద్దు సీన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్. ఏ డైరెక్టర్ స్టోరీ రెడీ చేసుకున్నా, అలాగే ఏ హీరో అయినా సరే, హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ అంటే కచ్ఛితంగా లిప్ లాక్స్ సీన్స్ ని ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఆ విధమైన సన్నివేశం ఉంటే సినిమాకి ఎంతో కొంత హైప్ క్రియేట్ అవుతుందని వీరి అభిప్రాయం. నిజానికి సౌత్ లో లిప్ లాక్ సీన్స్ అంటే ఇప్పటికీ మొక్కుబడిగా షూట్ చేస్తున్నారు. ఆ విషయం బాలీవుడ్ నుండి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలానే నేర్చుకోవాలి.

బాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ అంటే దాదాపు ఓ నిముషం పాటు ప్రేక్షకులను ఒళ్ళు పులకరించేలా ఉంటుంది. కానీ సౌత్ లో..ముఖ్యంగా తెలుగులో మాత్రం లిప్ లాక్ అంటే ఇంకా ట్రెడిషనల్ గానే ముగించేస్తున్నారు. కానీ, తెలుగులో కొత్తగా ఆలోచించి ఓ అడుగు మందుకేసిన యంగ్ హీరో, లిప్ లాక్ కాదు లిప్ లాంగ్ కిస్ కావాలని దర్శకుడి చేత తన మూవీలో దాదాపు 4 సీన్స్ ని పెట్టించాడు. అందులో హీరోయిన్ అప్పటికే నిత్యామీనన్ కన్ఫర్మ్ అయిందట.

హీరో డిమాండ్ మేరకు దర్శకుడు ఆ విషయాన్ని నిత్యా మీనన్ కి వివరించాడు. అందుకు నిత్యామీనన్ షాక్ అయిందంట. లిప్ కింగ్ విన్నాం కాని, లిప్ లాంగ్ కిస్ ఏంటి, అందులోనూ 4 సీన్సా? ఒక్కోదానికి ఓక్కో నిముషం పాటు రా ఫుటేష్ నే మూవీలోనూ ఉంచుతారా? అంటూ దర్శకుడిపై మండిపడిందంటా. దీంతో విషయం హీరో వద్దకు చెప్పిన దర్శకుడు, స్వయంగా హీరోనే హీరోయిన్ గా మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడంట.

మొత్తానికి కన్విన్స్ అయితే జరిగింది. అలా కన్విన్స్ అయిందే మాత్రం హీరో. హీరోయిన్ మాత్రం లిప్ కిప్ లేదు, లిప్ లాంగ్ కిస్ లేదు. ఓన్లీ హీరోయిన్ రోల్. అలా అయితేనే చేస్తాను. లేదంటే మానేస్తాను. రొమాంటిక్ సీన్స్ అయితే ఓకే. కానీ బిటౌన్ తరహా ప్రయోగాలకు మాత్రం నేను నో అని హీరోతో తెగేసి చెప్పింది. దీంతో హీరోయిన్ ని మార్చే ఉద్ధేశం లేక, హీరో కన్విన్స్ అయినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: