ఇండియన్ సినిమా సెలిబ్రేటీగా మారిపోయిన రాజమౌళి తాను ఎంత ఉన్నత స్థానానికి ఎదిగి పోయినా తన దృష్టిలో పడ్డ చిన్న సినిమాల గురించి అదేవిధంగా సామజిక విషయాల గురించి తన ట్విటర్ లో స్పందిస్తూ తనదైన బాణిలో వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం అటువంటి సదర్భమే మరొకటి జరిగింది. ఈసారి జక్కన్న తన అసంతృప్తిని న్యాయవ్యవస్థ పై ముఖ్యంగా చట్టాలు అమలు పై ఘాటైన వ్యాఖ్యలు చేసేలా చేసింది.

మన దేశంలో చట్టాలు అమలు జోక్ గా మారిపోయింది అని రాజమౌళి కామెంట్స్ చేసాడు. ఎన్ని పటిష్టమైన చట్టాలు వచ్చినా దేశంలో న్యాయం అమలు జరగడం లేదని కామెంట్స్ చేసాడు రాజమౌళి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని చట్టాలు వచ్చినా ‘బాహుబలి’ లాంటి సినిమాలు సైతం ఇంటర్ నెట్ లోకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి అంటూ ప్రముఖ పాత్రికేయురాలు సాక్షి ఖన్నా చేసిన ట్విట్ కు సమాధానంగా నేడు మనదేశంలో చట్టం ఒక జోక్ అయిపోయింది అంటూ వ్యాఖ్యానాలు చేసాడు రాజమౌళి.

రాజమౌళి చేసిన వ్యాఖ్యలు కేవలం ‘బాహుబలి’ పైరసీ గురించి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆమాటలు వెనుక నేడు  దేశంలో జరుగుతున్న అనేక అరాచకాలకు సంబంధించి నేరస్తులు పట్టుపడుతున్నా వారికి శిక్షలు పడటం లేదు అన్న భావం రాజమౌళి కామెంట్స్ లో కనిపిస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా గత కొద్ది రోజులుగా ‘బాహుబలి 2 ‘ స్టోరీ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా గడిపిన రాజమౌళి మరోసారి వర్క్ కి గ్యాప్ ఇచ్చి హాలిడేకి వెళ్లాడు అని సమాచారం.

సెప్టెంబర్ 1వ తేదీన ‘కంచె’ ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి ఇండోనేషియాలోని బాలి అనే దీవికి హాలిడేకి వెళ్ళాడు అని టాక్. అక్కడ కొద్ది రోజులు ఫ్యామిలీతో కలిసి హాలిడేని బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చాక ఫుల్ ప్లెడ్జ్ గా ‘బాహుబలి 2’ వర్క్ ను  మొదలు పెడతాడట మన జక్కన్న. ఏది ఎలా ఉన్నా రాజమౌళి చట్టం పై చేసిన వ్యాఖ్యలు మటుకు చాల మందిని ఆలోచింప చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: