ఈ సంవత్సరం టెంపర్ సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ మంచి దూకుడు మీదే ఉన్నాడు..సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం షూటింగ్ లండన్ లో షరవేగంగా జరుగుతుంది. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో ఉండే ఈ సినిమాలో ఎన్టీఆర్ న్యూ లుక్ తో అదరగొట్ట బోతున్నాడట. అయితే ఈ సినిమా టైటిల్ విషయంపై ఇప్పటికే రక రకాలు వార్తలు వచ్చాయి. తండ్రి సెంటిమెంట్ తో కొనసాగే చిత్రం కాబట్టి మా నాన్నకు ప్రమతో అని ఒకసారి నాన్నకు ప్రేమతో అని ఒకసారి.


ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి..ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ ఖరీదైన బైక్ ను వాడారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అలాగే కొన్ని కీలక సన్నివేశాలను లండన్ లో చిత్రీకరిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ స్టిల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో ఈ సినిమాకు బిజినెస్ ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ జెమిని టీవి ఛానెల్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది.  ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అయితే ఈ చినెమకూ ఇప్పటివరకు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  


సుకుమార్ తో ఎన్టీఆర్


ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మళ్లీ మారబోతున్నట్లు సమాచారం.. అప్పట్లో సినిమా కథ ప్రకారం తండ్రి సెంటిమెంట్ తో నడుస్తుందని అందుకోసం సినిమా టైటిల్ ‘మా నాన్నకు ప్రేమతో’ అని పెట్టాలని చూస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు టైటిల్ మారుస్తున్నారు.  రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: