తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోల చిత్రాలు భారీ స్థాయిలో రూపొందింస్తున్నారు.. అదే రేంజ్ లో ప్రచారం కూడా చేస్తున్నారు..దీనికి ఉదాహారణ ‘బాహుబలి’ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకు ఏ రేంజ్ లో హైక్ వచ్చిందో అందరికీ తెలుసు.. సినిమా షూటింగ్ జరుపుకునే దగ్గర నుంచి పూర్తయే వరకు ఫస్ట్ లుక్, టీజర్ లాంటి వాటితో జనాల్లోకి తీసుకు వెళ్లడం సినిమాపై భారీ అంచనాలు కలిగించడం జరగుతుంది.

ఈ మద్య చిరంజీవి పుట్టిన రోజు  గిఫ్ట్ గా రాంచరణ్ ‘బ్రూస్ లీ’ ఫస్ట్ లుక్..టీజర్ విడుదల చేశాడు...ఇక నాగార్జున తనయుడు అఖిల్ తన మూవీకి సంబంధించి టీజర్..ఫస్ట్ లుక్ విడుదల చేశాడు..ఇలా సెలబ్రెటీల పుట్టిన రోజు కానుకలు మూడు ఫస్ట్ లుక్కులు.. ఆరు టీజర్లుగా వెలిగిపోతున్నాయి. తాజాగా పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా రాంచరణ్ ‘బ్రూస్ లీ’ టీజర్ ఒకటి విడుదల చేశాడు.  ఇప్పటికే ఈ టీజర్ కి విశేష ఆదరణ వచ్చింది. దర్శకుడు శ్రీనువైట్ల బ్రాండ్ మార్క్ కామెడీతో పాటు, రామ్ చరణ్ స్టైల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది.

బ్రూస్ లీ లో ఓ దృశ్యం


ఇక శ్రీను వైట్ల అంటే కామెడీకి కేరాఫ్ అడ్రాస్..మరి ఆయన సినిమాలో ఏ రేంజ్ లో కామెడీ ఉంటుందో అని అందరూ ఊహిస్తూన్నారు.. మొన్న విడుదలైన టీజర్ లో చరణ్ సీరియస్ యాక్షన్ తో కనిపించాడు..త్వరలోనే ఓ కామెడీ టీజర్‌తో మిమ్మల్ని మెప్పించేందుకు వచ్చేస్తున్నాం” అని తెలిపారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: