ఒక యంగ్ హీరోని నమ్ముకుని క్రియేటివ్ దర్శకుడు క్రిష్ చేసిన సాహసం ఇప్పుడు అతడికి అనుకోని షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఒక మెగా యంగ్ హీరోను ఆధారంగా చేసుకుని 21 కోట్ల భారీ బడ్జెట్ సినిమాగా ‘కంచె’ మారడంతో క్రిష్ తనకు మించిన సాహసం చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. 

యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితుల్ని బ్యాక్ డ్రాప్ గా చూపెడుతూ అల్లిన అందమైన ప్రేమ కథ ‘కంచె’ ఈ సినిమా కోసం క్రిష్ ఏకంగా జార్జియా దేశంలోని మిలటరీ బేస్ క్యాంపుల వరకూ వెళ్లి అక్కడ సినిమాని షూట్ చేశాడు. జార్జియా దేశంలో రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , యుద్ధ ట్యాంక్స్ , యూనిఫాం, లొకేషన్స్‌ను అన్నిటిని చూపెడుతూ నిర్మించిన ఈసినిమాకు క్రిష్ కుటుంబ సభ్యుల డబ్బు దాదాపు 21 కోట్ల వరకు ఈసినిమా పై పెట్టుబడిగా చిక్కుకుంది అని టాక్. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై అందర్నీ ఆకర్షిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ టీజర్ ను చూసిన విమర్శకులు మాత్రం ఈసినిమా కథ గతంలో హాలీవుడ్ లో విడుదలైన ‘డియర్ జాన్' కథను పోలివుందని అంటున్నారు. అంతేకాదు సినిమా అంతా కాకపోయినా 'డియర్ జాన్' థీమ్ కు 'కంచె' కొంచెమయినా మ్యాచ్ అవుతుందని విశ్లేషకుల అంచనా. 

'డియర్ జాన్' సినిమాలో కూడా ప్రేమ కథకు యుద్ధాన్ని లింక్ చేసి తీసారు. ఇప్పుడు అదే మార్గాన్ని క్రిష్ అనుసరిస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. అయితే తాను ఎంతో కష్ట పడి తీసిన ‘కంచె’ సినిమాపై కాపీ రూమర్స్ ఏమిటి అంటూ క్రిష్ తల పట్టు కుంటున్నట్లు  టాక్ .



మరింత సమాచారం తెలుసుకోండి: