ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోయిన్ల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. కథకు తగ్గ హీరోయిన్ ని అన్వేషించి మరీ ఆ క్యారక్టర్ కి ఎవరైతే సూట్ అవుతారో వారినే పెట్టుకునేలా చేస్తాడు. ఇకపోతే రీసెంట్ గా వచ్చిన పండగ చేస్కో కూడా రామ్ ఎనర్జీని సరిగా చూపించలేక యావరేజ్ సినిమాగా నిలిచాడు. అన్ని హిట్ సినిమాల కథలు కలిపి పండగ చేస్కో కథని చేశాడని గోపిచంద్ మలినేని పై విమర్శలు కూడా వచ్చాయి అది వేరే విషయంలేండి.    

 

అయితే ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి శివమ్, ఇంకోటి హరికథ. ఆల్రెడీ శివమ్ దాదాపు కావొచ్చింది. ఇకపోతే తిరుమల డైరక్షన్ లో వస్తున్న హరికథ సినిమాకే ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ అవ్వలేదట. మాలీవుడ్ లో మాంచి స్వింగ్ లో ఉన్న కీర్తి సురేష్ ని రామ్ కి జోడీగా చేద్దామని అనుకుంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.   

 

మాళీవుడ్ లో ఓ రేంజ్ ఫామ్ లో ఉన్న కీర్తి సురేష్ ని టాలీవుడ్ కి పరిచయం చేద్దామని దాదాపు డిసైడ్ అయ్యారట చిత్రయూనిట్. దీనికి అమ్మడికి దాదాపు ఫార్టీ లాక్స్ దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఇక్కడ ఆ ఫిగర్ ఎక్కువ కాకపోవచ్చు కాని మాళీవుడ్ లో అది చాలా ఎక్కువట. అందుకే అమ్మడికి ఈ ఆఫర్ రాగానే రెమ్యునరేషన్ తెలుసుకున్న కొంతమంది వామ్మో అంత ఇస్తున్నారా..? అని ఆశ్చర్యపోతున్నారట. ఇంకా ఇదేం చూసారు ఒకటి రెండు సినిమాలు హిట్టై ఒక్క స్టార్ హీరోతో చేస్తే ఆ హీరోయిన్ వద్దనా మనవాళ్ళు కోటి రూపాయలు కూడా రెమ్యునరేషన్ ఇస్తారు.  

 

ఇంతకీ అమ్మడికి అంత సీన్ ఉందంటారా..? ఏమో చూద్దాం. మొత్తానికి రామ్ మళ్ళో కొత్త హీరోయిన్ తో సినిమా చేస్తున్నాడు అదే సంతోషం.


మరింత సమాచారం తెలుసుకోండి: