సినిమా ఒకసారి సక్సెస్ సాధించిందంటే దాన్ని సీక్వెల్ తీయడం అలావాటే మన దర్శక నిర్మాతలకు. అయితే  అదే సినిమా సీక్వెల్ ని ఆ రేంజ్లోనే తీసి మళ్ళీ ప్రేక్షకుల ఆదరణను పొందారు దర్శకుడు హరి, వర్సెటైల్ యాక్టర్ సూర్య. ఓ పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో పోలీస్ స్టోరీ ని చూస్తే మనకు ఎంత ఆవేశం కట్టలు తెంచుకు వస్తుందో, అలానే సింగం(యముడు), సింగం-2(యముడు2) సినిమాలను చూస్తే అలా అనిపిస్తుంది. సూర్యని ఒక నిజంగా సింహంలా చూపించడం ఒక్క హరికే సాధ్యపడింది. సూర్య కూడా ఈ సింగం సీరీస్ లకు చాలా హోం వర్క్ చేశాడు.  


ఇకపోతే ఇప్పుడు ఆ సినిమాకు థర్డ్ సీక్వెల్ ని తీద్దామనుకుంటున్నారు. సింగం 3 గా రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ ని రీసెంట్ గా కంప్లీట్ చేశారట. ముందు రెండు సినిమాల కన్నా ఈ పార్ట్ చాలా సూపర్బ్ గా ఉంటుందట. సినిమా టైటిల్ సీక్వెన్స్ లో ఉన్నా కథలను మాత్రం మారుస్తూ వస్తున్నాడు డైరక్టర్ హరి. అందుకే ఈ సినిమా కథను కూడా డిఫరెంట్ న్యారేషన్ తో రెడీ చేశాడట.


పకడ్బందీ స్క్రిప్ట్ తో, సింగం 3 గా వస్తున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఈసారి శృతి హాసన్ ని తీసుకున్నారు దర్శక నిర్మాతలు. స్క్రిప్ట్ సిద్దమైన ఈ సినిమా త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుందట. ప్రస్తుతం మనం విక్రమ్ దర్శకత్వంలో సూర్య నటిస్తూ నిర్మిస్తున్న ‘24’ సినిమా కంప్లీట్ చేశాకే, సింగం 3 షూట్ లో పాల్గొంటాడు. యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ మిరకిల్ అనిరుథ్ ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కి సంగీతాన్ని అందించనున్నాడు.     


మరి రెండు పార్ట్ లలలో కూడా విపరీతమైన ఎనర్జీతో పోలీస్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు చూపించి విజృంభించిన సూర్య నిజంగానే సింహం లానే గాండ్రించాడు. ఇప్పుడు ఇక ఆ సినిమా థర్డ్ సీక్వేల్లో కూడా ఓ రేంజ్లో ఆకట్టుకుంటాడనే ఆశిస్తున్నారు ప్రేక్షకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: