నిన్న విడుదల అయిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కూడ ఈసంవత్సరం టాప్ 5 హిట్స్ లో స్థానం పొందుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. ‘ఈగ’ సినిమా తరువాత మూడు సంవత్సరాల నాని ఎదురు చూపులకు ఫలితం దక్కింది. అయితే ఈసారి కూడ ఒకరికి రావలసిన అదృష్టం మరో హీరోకి దక్కింది. 

ఈసినిమా ప్రారంభానికి ముందు ఈసినిమా స్క్రిప్ట్ ను చేత పట్టుకుని దర్శకుడు మారుతి చాలా మంది హీరోలను కలిసినట్లు టాక్. అయితే ఆ హీరోలు ఎవరూ ఈ స్క్రిప్ట్ ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు. మారుతి ఈసినిమా విషయంలో మొదటిగా సునీల్ ను కలిస్తే ఇటువంటి సినిమాలో నటిస్తే తనను చూడరేమో  అంటూ కామెంట్ చేసాడట. ఆ తరువాత ఈకథను అల్లరి నరేశ్ కు వినిపిస్తే కొన్ని నెలలు ఏ విషయం తేల్చకుండా కాలయాపన చేసాడని టాక్. 

ఆ తరువాత మారుతి ఈ కథను ఇద్దరు ముగ్గురు హీరోల చుట్టూ తిరిగి అక్కడ కూడ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపధ్యంలో అనుకోకుండా ఈ సినిమా ప్రాజెక్ట్ లోకి నాని ఎంటర్ అయ్యాడని టాక్. బూతు సినిమాల ఇమేజ్ తో ఉన్న మారుతితో సినిమాలు చేస్తే అదే ఇమేజ్ తమపై పడుతుంది అన్న భయంతో సునీల్, అల్లరి నరేష్ లు తప్పుకుంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా నాని ఎంటర్ అయి సూపర్ హిట్ అందుకున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈసినిమాకు నిర్మాతగా డివివిదానయ్యను అనుకున్నారట. అయితే ఆయన ఈసినిమా స్క్రిప్ట్ నచ్చక పక్కకు తప్పుకోవడంతో యూవి క్రియేషన్స్ వాళ్ళు లైన్ లోకి రావాడమే కాకుండా వారే నాని పేరును మారుతికి సలహా ఇచ్చారట. ఇక ఆ తరువాత అల్లుఅరవింద్ ఈ ప్రాజెక్ట్ కు కలవడంతో మార్కెట్ పరంగా ఈసినిమాకు దశ తిరగడమే కాకుండా నాని తన అదృష్టాన్నే కాకుండా మారుతి అదృష్టాన్ని కూడ మార్చేశాడు.  లక్ గేమ్ అంటే ఇలాగే ఉంటుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: