తెలుగు సినిమా ప్రొడ్యూసర్లకు యూఎస్‌ మార్కెట్‌ కూడా ఒక కీలకమైన వ్యాపార ఎలిమెంట్‌ గా మారుతున్నది. ప్రధానంగా యూఎస్‌ మార్కెట్‌లో రాగల రిజల్టు మీద కన్నేసి.. సినిమాలను కాస్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లుగా, తక్కువ బూతు పాళ్లతో తీయడనికి మొగ్గుచూపుతున్న నిర్మాతల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నదని కూడా చెప్పుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో.. లేటెస్టుగా విడుదల అయినా నాని చిత్రం 'భలే భలే మగాడివోయ్‌' యూఎస్‌ మార్కెట్లో యిరగదీసేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. 


ఈ చిత్రం శుక్రవారం నాడే విడుదల అయింది. అయితే యూఎస్‌లో గురువారం నాడే పలుచోట్ల ప్రీమియర్‌ షోలు పడ్డాయి. ఈ ఒకటిన్నర రోజు వ్యవధిలోనే.. యూఎస్‌ మార్కెట్‌లో ఈ చిత్రం ఏకంగా ఆరులక్షల డాలర్లు వసూలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది చిన్న మొత్తం ఎంతమాత్రమూ కాదు. కేవలం ఇంత తక్కువ వ్యవధిలో ఈ చిత్రం 3,98,270 రూపాయలన్నమాట. అంటే దాదాపు నాలుగుకోట్ల మార్కెట్‌ వచ్చేసింది. 


భారత్‌లో కూడా ఈ చిత్రానికి భారీ పాజిటివ్‌ స్పందన వచ్చింది. సినిమా చక్కగా ఉన్నదనే అందరూ అంటున్నారు. తెలుగు సినిమాలకు యూఎస్‌ మార్కెట్‌ ఒక ప్రధాన వనరుగా మారుతున్న సమయంలో.. పలువురి చేతులు మారి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద తెరకెక్కిన ఈ చిత్రం కొత్త ఆశలను రేకెత్తిస్తున్నది. మంచి పాజిటివ్‌ ఆటిట్యూడ్‌తో హృద్యంగా ఉండే చిత్రాలను రూపొందించినట్లయితే.. చిన్న చిత్రాలైన విశాలైన రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్‌తో సమానంగా.. యూఎస్‌ మార్కెట్‌ కూడా లాభాలు అందిస్తుందని ఇది నిరూపిస్తున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: