మెగా స్టార్ – సూపర్ స్టార్ – పవర్ స్టార్ – మెగా పవర్ స్టార్ ల పేర్లు వినగానే ఆ టాప్ హీరోలు గుర్తుకు వస్తారు. అయితే ఈ బిరుదులకు తానేమి తీసిపోను అంటూ నాని అడుగులు వేస్తున్నాడు. నిన్న విడుదలైన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా టైటిల్స్ లో నాని పేరు ముందు నేచురల్ స్టార్ అని వేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

దీనితో నానీకి కూడ ఒక బిరుదు ఏర్పడిందా అంటూ కొందరు సెటైర్లు వేసుకున్నట్లు టాక్. సహజ నటి అని జయసుధను పిలుస్తారు. ఇక నిన్నటి నుంచి సహజ నటుడు హీరో నాని అని పిలిచే రోజులు వచ్చాయి అనుకోవాలి. అయితే నాని పేరు ముందు ఉన్న ఈ ట్యాగ్ నాని నటనకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. ఎటువంటి పాత్రలో అయినా సహజంగా ఒదిగిపోయే నాని ప్రతిభను చూసి బాగా ఆలోచించి మారుతి ఈ బిరుదు ఇచ్చి ఉంటాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈవార్తలు ఇలా ఉండగా మారుతి ఈసినిమాలో కూడ మెగా భజన బాగా చేసి రక్తి కట్టించాడు. చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎమ్ బి బి ఎస్’ సినిమాలోని కొన్ని సన్నీ వేశాలను అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమాలలోని కొన్ని పాటలను తీసుకుని నానీ పై ‘భలే భలే మగాడివోయ్’ లో చేసిన ప్రయోగం మెగా అభిమానులకు కూడ బాగా నచ్చడంతో ఈసినిమా మెగా అభిమానుల దృష్టిలో కూడ పడింది. 

అంతేకాదు తాను ఏ హీరోలతో సినిమాలు చేసినా మెగా కాంపౌండ్ భజన చేయడంలో తనను మించిన వారు మరొకరు లేరు అని మారితి మరొకసారి రుజువు చేసుకున్నట్లు అయింది. ఈ భజన మెగా హీరోల దృష్టికి వెళుతుంది కాబట్టి ఎవరో ఒక మెగా హీరో త్వరలో మారుతి బుట్టలో పడే అవకాశం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: