చరిత్ర సృస్టించిన ‘బాహుబలి’ టైటిల్ కు పేరడీ చేయాలి అంటే చాల ధైర్యం ఉండాలి. అయితే అటువంటి సాహసం దాసరి శిష్యుడు చేస్తూ ఉండటంతో ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ కు హాట్ న్యూస్ గా మారింది. శ్రీకాంత్ ను హీరోగా పెట్టుకుని ‘ఢీ అంటే ఢీ’ అనే ఫెయిల్యూర్ సినిమాను తీసిన జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఈ సాహసం చేయబోతున్నాడు. 

తాను దర్శకత్వం వహించే లేటెస్ట్ సినిమా వివరాలు చెప్పడానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ దర్శకుడు తాను తీయబోయే లేటెస్ట్ సినిమా పేరు ‘జ్ఞానబలి’ అని ప్రకటించి మీడియా వారికి షాక్ ఇచ్చాడు ఈ దర్శకుడు. అంతేకాదు తన గురువు దాసరి నారాయణరావు ఆశీస్సులతో ఈసినిమాను తీస్తున్నానని ఈసినిమాకు ఈ టైటిల్ ను దాసరి సూచించారు అంటూ షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు జొన్నల గడ్డ శ్రీనివాసరావు.

అంతేకాదు దాసరి చెప్పిన ఒక సరికొత్త పాయింట్ ఆధారంగా రచయితల బృందం స్ర్కిప్ట్‌ తయారు చేసే పనిలో ఉంది అని అంటూ ఒక సంచలనకథానాయకుడు ఇందులో నటిస్తాడు అన్న షాకింగ్ న్యూస్ ను బయట పెట్టాడు దాసరి శిష్యుడు. అక్టోబర్‌లో షూటింగ్‌ ప్రారంభించి, సింగిల్‌ షెడ్యూల్‌లో నిర్మాణం పూర్తి చేస్తాం అని చెపుతున్న ఈ దర్శకుడి మాటలు విని ఆ మీడియా సమావేశానికి వచ్చిన వారు కూడ ఆశ్చర్య పోయారని టాక్. 

ఒక వైపు ‘బాహుబలి 2’ స్క్రిప్ట్ గురించి రాజమౌళి మేధోమధనం చేస్తూ ఉంటే మధ్యలో పుట్టుకు వచ్చిన ఈ ‘జ్ఞానబలి’ ఎంతోకొంత రాజమౌళి దృష్టిలో పడటం ఖాయం. సంచలనాలు చేసే దాసరి ఆశిస్సులతో ఈ సినిమా తీస్తున్నారు అంటున్నారు కాబట్టి ఎదో ఒక పెద్ద సెటైర్ ఈ ‘జ్ఞానబలి’ లో ఉండే అవకాశం ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: