తెలుగు ఇండస్ట్రీలోకి ఒక సామాన్య  కమెడియన్ గా వచ్చి అనుకోకుండా నిర్మాతగా మారి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్స్ లీస్టు లో చేరిపోయారు బండ్ల గణేష్. ఈయన మెగా కుటుంబం అంటే వల్లమాలిన అభిమనం..ఇక పవన్ కళ్యాన్ అంటే ప్రాణాలు సైతం ఇస్తానంటాడు..తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే.. జీవితాన్ని ఇచ్చింది పవన్ కళ్యాన్ అంటాడు. అలాంటి పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్’ గురించి మెగా అభిమానులను కన్ఫూజ్ చేసే విధంగా ఓ ట్విట్ పెట్టాడు..ఇప్పుడు అది సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది.  

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘గబ్బర్ సింగ్’  1210రోజులుగా నడుస్తూనే ఉంది అంటూ నిర్మాత బండ్ల గణేష్ చెప్పడంతో ఇంతకీ ఆ థియేటర్ ఎక్కడుందో తెలియక తికమక పడుతున్నారు అటు పవన్ ఫ్యాన్స్ ఇటు మీడియా వాళ్ళు సైతం . 1210రోజులుగా గబ్బర్ సింగ్ సినిమా రన్ అవుతుంటే అది ఏ థియేటర్ ,ఏ జిల్లా తదితర విషయాలు కూడా వెల్లడిస్తే బాగుండేది కదా ! అని అంటున్నారు.

గబ్బర్ సింగ్ పోస్టర్


పవర్ స్టార్ అంటే అభిమానం ఉన్నవాళ్లు ఆ సినిమాను ఎన్నిరోజులైనా చూస్తారు.. అందులో అతిశయోక్తి లేదు.. కానీ  ఆ థియేటర్ ఎక్కడ అని తెలిసి ఉంటే ఆ విషయం కూడా ఫుల్ గా పబ్లిసిటి అయ్యేది కదా..! ఒకవేళ బండ్ల అది ఆడుతున్న మాట నిజమే అయితే సవివరంగా వివరాలు ఇవ్వాలి కదా ! అంతేకాని ట్వీట్ చేసి పవన్ సినిమా గబ్బర్ సింగ్ స్థాయిని దించడం ఎందుకు ? గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అన్నమాట అందరికీ తెలిసిందే... ఇప్పటికైనా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి బండ్ల ఆ థియేటర్ వివరాలు ఇస్తారో ఇవ్వరో వేచి చూడాల్సిందే..

బండ్ల గణేష్ ట్విట్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: