తెలుగు చిత్ర సీమలో ఇప్పటి వరకు ప్రయోగాత్మక క్యారెక్టర్స్ ఎక్కువగా విశ్వ నటుడు కమల్ హాసన్ తర్వాత విక్రమ్ లు చేయడం చూశాం.. వీరికి ధీటుగా అందాల తార అందులోనూ యోగా తో ఫిట్ నెస్ కు మారుపేరుగా ఉన్న హీరోయిన్ అనుష్క చేసిన ప్రయోగం చూస్తూంటే ఔరా అనిపిస్తుంది.. తాజాగా అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న 'సైజ్‌ జీరో' టీజర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.  

ఈ టీజర్ చూస్తుంటే ఔరా నిజంగా అనుష్క ఇలా ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది. అధిక బరువుతో అనుష్క పడే తంటాలు, బరువు మనిషి లక్ష్యానికి ఆటంకం కాదని నిరూపించే మంచి మెస్సేజ్ ఓరియెంటె సినిమాను ప్రకాశ్ కోవెలమూడి తెరకెక్కిస్తున్నారు. తెలుగు తమిళ భాషలో వస్తోన్న ఈ సినిమాను ప్రసాద్ వి పోట్లూరి నిర్మిస్తున్నారు. అనుష్క మరింత లావుగాను .. మరికాస్త సన్నగాను డిఫరెంట్ లుక్స్ తో కనిపించే 'సైజ్ జీరో' సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న సైజ్ జీరో సినిమా టీజర్ విడుదలయింది. అనుష్క అదేపనిగా తింటూ .. భారీకాయంతో అవస్థలు పడుతోన్న దృశ్యాలతో ఈ టీజర్ ను కట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ హల్ చేస్తోంది. అనుష్క తన ఫేస్‌బుక్, ట్విట్టర్ వాల్‌పై ఈ టీజర్‌ను అప్‌లోడ్ చేసింది.

సైజ్ జీరో చిత్రంలో అనుష్క


అనుష్క సరసన హీరోగా ఆర్య నటిస్తున్నాడు. తెలుగు ,తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్ర నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ చిత్ర ఆడియో రేపు రిలీజ్ కానుంది.  ఇప్పుడు ఈ సినిమా టీజర్ యూట్యాబ్ లో సంచలన రికార్డు సృష్టించింది. ఆడియో విడుదల సందర్భంగా ఒక టీజర్ విడుదల చేశారు.. అందులో అనుష్క వెరైటీ గా కనిపించడంతో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షించింది. కేవలం 5రోజుల్లోనే ఆ టీజర్ ని 20లక్షల మందికి పైగా వీక్షించారు . దాంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అసలే భారీ అందాల భామ కావడంతో అనుష్క ను చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదంటే నమ్మండి . 


మరింత సమాచారం తెలుసుకోండి: