తెలుగు ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఆధరణ ఉంటుందని మరోసారి నిరూపించింది ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకత్వంలో హీరో నానీ, లావణ్య త్రిపాఠి నటించిన ఈ చిత్రం నిన్న విడుదలైంది. ఈ సినిమా వెరైటీ కాన్సెప్ట్ తో దర్శకుడు తెలుగు ప్రేక్షకులను మరో సారి కడుపుబ్బా నవ్వించాడు. మతిమరుపు వ్యక్తిగా నానీ అద్భుతమైన నటన ప్రదర్శించాడు.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందాడు.. ఇప్పటి వరకు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నానికి మంచి పర్వాన్న భోజనం లభించినట్లయ్యింది.


ఇప్పుడు ఈ సినిమా పై టాలీవుడ్ సెలబ్రెటీస్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ''భలే భలే మగాడివోయ్ '' చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వస్తోంది , ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతూ దూసుకుపోతోంది. గతంలో దర్శకుడు మారుతి హర్రర్ చిత్రంలో కామెడీ చేర్చి ‘ప్రేమ కథాచిత్రమ్’ సినిమా తీశారు. ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని చూసిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నాని పై ప్రశంసల వర్షం కురిపించాడు .


'భలే భలే మగాడివోయ్ '' చిత్రంలో నాని,లావణ్య త్రిపాఠి


ఈ సినిమాలోని చాలా సంఘటనలు నా జీవితంలో జరిగినవేనని నాని ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు అనిపించిందని ,ఇది చక్కని వినోదాత్మక చిత్రమని ట్వీట్ చేసాడు. ఇప్పటికే భలే భలే మగాడివోయ్ చిత్రం కు ప్రేక్షకుల ప్రశంసలు అందుతుండగా దానికి జక్కన్న కూడా తోడవడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

రాజమౌళి ట్విట్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: