చిన్న సిమామాలకు కేరాఫ్ అడ్రస్ మారిన స్టార్ హీరో నాని. ఇప్పుడు నానితో సినిమా అంటే లో బడ్జెట్ మూవీ. అయితే రిలీజ్ అనంతరం మాత్రం అది బాక్సాపీస్ వద్ద నిర్మాతలకు కాసులు కురించే మూవీ. నానితో సరైన సబ్జెట్ ప్లాన్ చేసుకోవాలి కాని, నిర్మాతలకు లాభాల తెచ్చిపెట్టడం ఖాయం అని ఇండస్ట్రీ టాక్.

అందుకే నానితో మూవీలను నిర్మించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతారు. ఆ విధంగానే తాజాగా నాని నటించిన భలే భలే మగాడివోయ్ చిత్రం ప్రస్తుతం థియోటర్స్ వద్ద సందడి చేస్తుంది. దర్శకుడు ‘మారుతి’తో కలిసి చేసిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నానికి మంచి పేరును తీసుకువచ్చింది. గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ పతాకంపై మొదటి సినిమాగా రూపొందిన ఈ సినిమాపై మార్కెట్ లో హైప్ క్రియేట్ అయింది.

అందుకే భలే భలే మాగాడివోయ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. నాని బ్రాండ్ కామెడీ టైమింగ్, మారుతి క్లీన్ కామెడీ, మతిమరుపు ప్రేమికుడి పాట్లు ప్రేక్షకులను బాగా నవ్విస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో, గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో మరో మూవీకి నాని అవకాశాన్ని సంపాదించాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ నుండి నానికి అఫిషియల్ మరో మూవీకి ఆఫర్ వచ్చినట్టు ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో నాని తెల సంతోషంలో ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: