ప్రస్తుతం భలే భలే మాగాడివోయ్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో నాని, తాజాగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి కి సంబంధించిన మూవీల విషయంలో టంగ్ స్లిప్ అయ్యాడు. దీంతో నానిపై రాజమౌళి కొద్దిగా సీరియస్ అయ్యాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, గతంలో రాజమౌళి ‘ఈగ’ అనే సినిమాతో ఇండియా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసాడు.

ఈగలో హీరో నాని కొద్దిసేపే కనిపించినా, సినిమా మొత్తం తన ప్రభావం ఉంటుంది. ఈగ మూవీ నుండి రాజమౌళితో నాని పరిచయం బలంగా తయారైంది. మూవీలకి సంబంధించిన ఎటువంటి అనుమానాలైనా నాని, రాజమౌళితో ప్రత్యేకంగా డిస్కషన్ చేస్తాడు. ఇదిలా ఉంటే రాజమౌళి వద్ద కాన్ఫిడెన్షియల్ గా ఓ మూవీకి సంబంధించిన వివరాలను నాని పొరపాటున టంగ్ స్లిప్ అయ్యాడు. భలే భలే మగాడివోయ్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా నాని, తన అప్ కమింగ్ మూవీలకి సంబంధించిన వివరాలను తెలియజేశాడు. 

‘రాజమౌళి గారు ఈగ 2చెయ్యడానికి బాగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఎక్కువ భాగం బాహుబలి 2ఫినిష్ అవ్వగానే ఈగ 2 మొదలయ్యే అవకాశం ఉందని’ తెలిపాడు. నిజానికి బాహుబలి2 తరవాత రాజమౌళి ఏ మూవీ చేయబోతున్నాడు అనేది ఇప్పటికీ చాలా మంది కన్ ఫ్యూజన్ లో ఉన్నారు.

బాహుబలి2 తరువాత రాజమౌళితో మూవీని కమిట్ చేయటం కోసం టాప్ హీరోలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని, నాని మాత్రం బాహుబలి2 అనంతరం రాజమౌళి ఈగ2 చేస్తున్నాడంటూ అసలు సీక్రెట్ ని చెప్పుకొచ్చాడు. ఈగ2 విషయాలను అప్పుడే బయటపెట్టినందుకు నానిపై రాజమౌళి సీరియస్ అయినట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: