తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు నెం.1 హీరోల రేస్ లో పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ప్రభాస్,ఎన్టీఆర్ లాంటి హీరోలు ఉన్నారు. అయితే వీరి ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలు అంటే పడిచస్తారు. తమ అభిమాన హీరోల సినిమాలు వచ్చినా.. పుట్టిన రోజు వచ్చినా భారీ స్థాయిలో కార్యక్రమాలు చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడం... చించడంతో సమస్య తలెత్తింది. ఇది చిలికి చిలికి గాలి వానగా మారింది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇద్దరు తెలుగు హీరోల అభిమానుల మధ్య నిప్పురాజుకుంది. మూడు రోజుల క్రితం మొదలైన ‘ఫ్లెక్సీ’ వార్ నేపథ్యంలో భీమవరంలో పోలీసులు 144 సెక్షన్ నిషేధాజ్ఞలను విధించారు. పవన్ పుట్టిన రోజు  సంధర్భంగా  ఫ్యాన్స్ మద్య  జరిగిన  ప్లెక్సీ ల గొడవలో  తాజాగా  10 మంది ని అరెస్ట్ చేశారు భీమవరం పోలీసులు,అయితే అరెస్ట్ అయిన వారు పవన్ ప్యాన్స్ అని, వారిని విడుదలచేయాలిని పోలీస్ స్టేషన్ ముందు పవన్ అభిమానులు నిరసన చేపట్టారు.ప్రభుత్వ ప్రయివేట్ ఆస్తులు ధ్వంసం చేశారట. దానికి సంబంధించి ఓ 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు .

పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ప్లెక్సీ ల గొడవ


ఇక భీమవరం టౌన్ లో ఉన్న అన్ని ప్రభాస్, పవన్ ఫ్లెక్సీలను తొలగించారు పోలీసులు. పోలీసులు అరెస్ట్ చేసిని వారిలో చాలా మంది విద్యార్థులే ఉండడం గమనార్హం.  భీమవరం మున్సిపాలిటీ సిబ్బందితో ఏర్పాటు చేసిన అన్ని ఫ్లెక్సీలను తొలగించారు. ఇక ముందు అనుమతులు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చెయ్యడానికి వీలు లేదని భీమవరంలో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే రెండు వర్గాల కారణంగానే పరిస్థితి దారుణంగా మారిందని పోలీసులు బావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: