‘కృష్ణం వందే జగద్గురం’ ఈ నెల 30 విడుదల కాబోతోంది. దర్శకుడికి టెన్షన్ లేదు. హీరోకి టెన్షన్ లేదు. ఎందుకంటే కథ బాగుందని దర్శకుడి ధీమా. ‘కథను నేను ఎంచుకోలేదు... కథే నన్ను ఎంచుకుంది’ అని రానా ధీమా. అయితే... టెన్షన్ అంతా ఎవరికీ అంటే రానా కుటుంబ సభ్యులకి. ఎందుకంటే... రానా బలం ఏంటో బలహీనత ఏంటో వాళ్లకి తెలీదా? ఇంతకీ వాళ్లు కంగారు పడుతున్న అంశం ఏంటంటే... రానా భావ వ్యక్తీకరణ విషయంలో. రానా మాంచి హైట్. మాంచి బాడీ. మాంచి వాయిస్ కూడా. కానీ... అతడి ముఖంలో ఫీలింగ్స్ సరిగ్గా పలకవు అనేది మొదట్నుంచీ ఉన్న విమర్శ. ఆ విషయంలో రానా కాస్త మార్చుకుంటే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి ఇప్పుడున్న కుర్ర హీరోల కంటే రానా చాలా విషయాల్లో బెటర్. అయితే... ఈ ఒక్క విషయంలో తేడా వల్లే రేసులో కాస్త వెనుకపడ్డాడని చర్చించుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలవుతున్న తరుణంలోనూ రానా బాబుకి ఈ విషయంపైనే కాస్త శ్రద్ధపెట్టమని కుటుంబ సభ్యులు చెప్పారట. మరి, ఏమేరకు శ్రద్ధ తీసుకున్నాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే... ఈ మధ్య దర్శకుడు క్రిష్ మాత్రం ప్రతీ విలేకరుల సమావేశంలోనూ ‘రానా చాలా బాగా నటించాడు. అతడి భావప్రకటనే సినిమాకి ప్లస్ అవుతుంది’ అని ధీమాగా చెబుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: