రాశి ఖన్నా రేంజ్ పెరిగిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటి దాకా చిన్న సినిమాలలో చిన్న హీరోలతో చేసిన రాశి ఖన్నా ఇక నుంచి స్టార్ స్టేటస్ ఉన్న హీరోలతోనే నటించాలని నిశ్చయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే అమె వద్దకు చిన్న హీరోల సినిమా అవకాశాలు వచ్చినా పట్టించుకోవడం లేదని ఫిలింనగర్ టాక్.

అంతేకాదు చిన్న హీరోల సినిమాలలో నటించడానికి భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తున్నా ఆ ఆఫర్లకు కూడ రాశి ఖన్నా నొ చెపుతోందని టాక్. ప్రస్తుతం రవితేజా రామ్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్న రాశి ఖన్నా ఈ రెండు సినిమాలు విజయవంతం అయితే తాను టాప్ హీరోయిన్ స్టేటస్ కు వెళ్ళి పోతానని నమ్మకం పెట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నారా రోహిత్ నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో నటించబోతున్న లేటెస్ట్ సినిమాకు సంబంధించి హీరోయిన్ గా రాశి ఖన్నాను నటించమని అడిగితే ఆ ఆఫర్ ను కూడ ఈమె తిరస్కరించింది అన్న వార్తలు వస్తున్నాయి. 

దీనితో నారా రోహిత్ న్యూజిలాండ్ కు చెందిన లతా హెగ్డే అనే కొత్త హీరోయిన్ ను తన సినిమాకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన లత హెగ్డే ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉంటున్నా ఆమెకు మోడలింగ్ పట్ల, సినిమాల పట్లా ఉన్న కోరికతో నారా రోహిత్ ఆఫర్ ను వెంటనే ఒప్పుకుంది అని టాక్. రవితేజాతో రాశి ఖన్నా చేస్తున్న ‘బెంగాల్ టైగర్’ విజయం పై నమ్మకం పెట్టుకోవడం మంచిదే కాని ఇలా వస్తున్న అవకాశాలు అన్నీ వదులుకుంటే రాశి ఖన్నా చిక్కుల్లో పడుతుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: