ఇదేంటి, బాద్షా థర్డ్ పార్టీకేంటి... అనిపిస్తోందా? అవును, బాద్షా సినిమా హక్కులు అలాగే అమ్ముతున్నారట మరి. సాధారణంగా సినిమా హక్కులను టీవీఛానళ్ల వారికి నేరుగా అమ్ముతారు. అంటే... హీరోలకున్న క్రేజ్ ని బట్టి సినిమా ఛానళ్లు కొంత డబ్బిచ్చి సినిమాలు కొనుక్కుంటుంటాయి. అయితే, ఈ వ్యవహారం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయట. నిర్మాతలకీ, టీవీ ఛానళ్ల వాళ్లకూ మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు, గొడవలు వస్తున్నాయట. మరి, అలా జరగడం మంచిది కాదు కదా. అందుకే, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సినిమాల హక్కులను నేరుగా టీవీ ఛానళ్లకు అమ్మకుండా ఉంటే సరి. అంటే, వేరే వాళ్లకు అమ్మాలన్నమాట. వాళ్ల దగ్గర నుంచి టీవీ ఛానళ్లు కొనుక్కుంటాయి. ఇక్కడో తిరకాసు ఉంటుంది. దీనివల్ల సినిమా నిర్మాతలకు కాస్త తక్కువ ధర, టీవీ ఛానళ్లకు కాస్త ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయినా ఫర్వాలేదనుకున్నారు బాద్షా నిర్మాతలు. బాద్షా సినిమా హక్కులను థర్డ్ పార్టీకి అమ్మేస్తున్నారు. సో, మామూలుగానే ఎక్కువ ధర పలికే బాద్షా సినిమా ఇప్పుడు మరింత ధర పలకనుందన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: