హాలీవుడ్ సినిమాల ప్రభావంతో బాలీవుడ్ ఆ ప్రభావంతో టాలీవుడ్ లలో సినిమాలు రావడం సర్వసాధారణం. కాని దీనికి భిన్నంగా ‘బాహుబలి’ సీన్స్ ను అనుకరిస్తూ ఒక హాలీవుడ్ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఫోటోలు ఇప్పుడు మీడియాకు లీక్ కావడంతో ఆ ఫోటోలను చూసి చాలామంది ఆశ్చర్యపడటమే కాకుండా రాజమౌళి ‘బాహుబలి’ సీన్స్ ను హాలీవుడ్ కాపీ చేస్తోందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ అయితే అ ఫోటోలను తన ట్విటర్ లో పెట్టి డిస్నీ ‘జంగిల్ బుక్’ సీక్వెల్ కు సంబంధించిన వాటర్ ఫాల్ ఫోటోస్ చూస్తూ ఉంటే ‘బాహుబలి’ లోని వాటర్ ఫాల్ సీన్స్ ను ‘జంగిల్ బుక్’ అనుసరించిందా అని అనుమానం వస్తుందని సెటైర్ కామెంట్స్ పెట్టడమే కాకుండా ఈ ఫోటోలు ముందు విడుదలై ఉంటే రాజమౌళి హాలీవుడ్ సినిమా సీన్స్ ను కాపీ చేసాడు అంటూ మీడియా  టార్గెట్ చేసి ఉండేదని కామెంట్ చేసాడు శోభు యార్లగడ్డ.

హాలీవుడ్ సినిమాలలో వాల్ట్ డిస్నీ క్రియేట్ చేసిన’ జంగిల్ బుక్’ ఇప్పటికీ ఒక గ్రాఫిక్ మాయాజాలం. ఈసినిమాను అనుసరిస్తూ అనేక కామిక్స్ అలాగే అనేక హాలీవుడ్ టివి సీరీస్ లు కూడ వచ్చాయి. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన సీక్వెల్ ట్రైలర్ ప్రపంచంలోని అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

‘బాహుబలి’ వాటర్ ఫాల్స్ సీన్స్ జంగిల్ బుక్ లో కనిపించడం యాదృచ్చికమే అయినా రాజమౌళి ఖ్యాతిని హాలీవుడ్ గుర్తించడమే కాకుండా జక్కన్న టెక్నిక్ ను అనుసరిస్తోందా అని అనిపించడం సహజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: