‘స్వామిరారా’, కార్తికేయ’ సినిమాల వరస హిట్లతో స్పీడ్ పెంచుకున్న నిఖిల్ కు కొద్దికాలం క్రితం విడుదలైన ‘సూర్య వర్సస్ సూర్య’ పరాజయం చెందడంతో షాక్ అయిన నిఖిల్ తన స్పీడ్ తగ్గించి చాల ఆలోచించి కోన వెంకట్ స్క్రిప్ట్ అందించిన ‘శంకరాభరణం’ లో నటిస్తున్నాడు. ఇంచుమించు ఈసినిమా చిత్రీకరణ పూర్తి అయింది. 

ఈసినిమా టైటిల్ కు ఉన్న క్రేజ్ తో తనకు గతంలో ‘కార్తికేయ’ సినిమాకు అచ్చొచ్చిన దీపావళి సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుని ఈసారి కూడా నవంబర్ 6న దీపావళికి ముందు విడుదల చేద్దామని అనుకున్నాడట. అయితే అతడి ఆశలను నీరు కారుస్తూ వరుణ్ తేజ్ ‘కంచె’ నవంబర్ 6కు వాయిదా పడటం నిఖిల్ కు షాకింగ్ గా మారింది అని అంటున్నారు. 

దీనికితోడు ఇదే డేట్ ను టార్గెట్ చేస్తూ కమలహాసన్ తన ‘చీకటి రాజ్యం’ సినిమాను కూడ ఇదే తేదీకి విడుదల చేస్తూ ఉండటంతో తనకు గతంలో కలిసి వచ్చిన దీపావళి సెంటిమెంట్ ఈసారి కలిసి రావడంలేదు అని బాధ పడుతున్నట్లు టాక్. దీనితో తన సినిమాను మరొక డేట్ కు వాయిదా వేసుకోవలసిన పరిస్థితి నిఖిల్ కి ఏర్పడింది అని టాక్. 

బీహార్ బందిపోటు దొంగల కథ నేపధ్యంలో నిర్మింప బడుతున్న ఈసినిమా పై నిఖిల్ తో పాటు బందిపోటు నాయకురాలుగా ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్న అంజలి కూడ ఎక్కువ అంచనాలే పెట్టుకుంది. ఏమైనా ‘కంచె’ వరుణ్ తేజ్ ఎంతవరకు హిట్ ఇస్తుందో తెలియదు కాని నిఖిల్ కు కలిసిరావడంలేదు..  



మరింత సమాచారం తెలుసుకోండి: