ఎనర్జిటిక్ హీరో రామ్ తో హీరోయిన్ గా ‘శివమ్’ సినిమాలో నటిస్తున్న రాశి ఖన్నా ఈరోజు ఒకప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో రామ్ పై ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. రామ్ తో తాను ‘శివమ్’ లో నటించాక అప్పటి వరకు తనకు రామ్ పై ఉన్న అభిప్రాయం మార్చుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రాశి ఖన్నా.

ముద్దుగా బొద్దుగా ఉండే రాశి ఖన్నా తాను నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ కు క్రేజీ బ్యూటీగా మారింది. ప్రస్తుతం ఈమె రామ్ తో నటిస్తున్న సినిమాపై ఈబ్యూటీ చాలఆశలు పెట్టుకుంది. అయితే ఈసినిమాలో నటించేంత వరకు రాశి ఖన్నాకు తనకు తానే చాల హార్డ్ వర్కర్ అనే అభిప్రాయం ఉండేదట. అయితే రామ్ ని చూసాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నాను అంటోంది ఈబ్యూటీ. 

దీనికికారణం ఈసినిమాలో రామ్ చేసిన డాన్స్ మూమెంట్స్ అని చెపుతోంది. డాన్స్ డైరెక్టర్ ఒక్కసారి డాన్స్ మూమెంట్స్ చెపితే చాలు ఎటువంటి రిహార్సిల్స్ లేకుండా సింగిల్ టెక్ లో రామ్ ఓకే చేసేవాడని అయితే తనకు ఆ డాన్స్ మూమెంట్స్ సరిగ్గా రాకపోవడంతో ఎక్కువ సేపు రిహార్సిల్స్ చేయవలసి వచ్చేదని అప్పటిదాకా రామ్ చాల ఓపికగా ఎటువంటి అసహనం లేకుండా తన గురించి వెయిట్ చేసేవాడని అంటూ రామ్ ని ఆకాశానికి ఎత్తేసింది రాశి.

నార్వే, స్వీడన్ లలోని కొన్ని ప్రమాదకరమైన ఎత్తైన లోకేషన్స్ లో ఈసినిమా పాటలు చాలఅందంగా తీసారని చెపుతూ ఈసినిమాలో ఒకపాట కోసం ఇప్పటి వరకు ఏ హీరోయిన్ వేసుకొని ఒక స్పెషల్ డిజైన్ తో చేసిన తన డ్రెస్ ఈసినిమాకు హైలెట్ గా మారుతుంది అని చెపుతోంది రాశి ఖన్నా. రామ్ కెరియర్ కు కీలకంగా మారిన ఈసినిమా విజయం పైనే రామ్ కెరియర్ ఆధారపడి ఉంటుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: