బాలీవుడ్ మార్కెట్ కూ మన మార్కెట్ కూ అదే తేడా. దానికి ప్రేక్షకులు ఎక్కువ. కలెక్షన్లూ ఎక్కువే. ఇప్పటికే ఈ విషయాన్ని గజినీ, బాడీగార్డ్, త్రీ ఇడియట్స్, జబ్ తక్ హై జాన్... వంటి సినిమాలన్నీ నిరూపించాయి. ఈ సినిమాలన్నీ వంద నుంచి రెండువందల కోట్ల కలెక్షన్లు వసూలు చేసి, సినీ విశ్లేషకుల అంచనాలనే తలకిందులు చేశాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా కూడా చేరింది. అదే మర్యాద రామన్నకు హిందీ చిత్రం... సన్ ఆఫ్ సర్దార్. అజయ్ దేవ్ గణ్, సోనాక్షీ నటించిన ఈ సినిమాను మొదట్లో ఫర్వాలేదన్నారు విమర్శకులూ విశ్లేషకులూ. కానీ, ఈ చిత్రం వాళ్ల అంచనాలను తలకిందులు చేసింది. నవంబరు 13న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్లు వసూలు చేసేసింది. ఇది కేవలం మనదేశంలో కలెక్షన్ మాత్రమే. విదేశాలది ఇందుకు అదనం. మొత్తమ్మీద రాజమౌళి చేసిన తెలుగు సినిమా విక్రమార్కుడు హిందీ రీమేక్ రౌడీ రాథోడ్ వందకోట్ల రూపాయల మార్కును దాటేసింది. ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ కూడా వందకోట్ల మార్కును దాటింది. బాలీవుడ్ వాళ్లు రాజమౌళికి అభినందనలు చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: