ఈ వారం కూడా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేదు. శుక్రవారం 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రం విడుదలైంది. ఓ వైపు సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. గబ్బర్ సింగ్ డబుల్ సెంచరీ కొట్టాడు. అలాంటి విశేషాలతో ఈ వారం ఫిల్మ్ హైలెట్స్ మీ కోసం. కృష్ణం వందే జగద్గురుం రివ్యూ దగ్గుబాటి రానా-నయనతార జంటగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన మూవీ కృష్ణం వందే జగద్గురుం. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేదం తర్వాత క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఏముంది? క్రిష్ మరో విజయాలన్ని అందుకున్నట్టేనా? అసలు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? ఈ సినిమా రివ్యూ మీకోసం. Link :http://www.apherald.com/Movies/Reviews/7502/   సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు హైదరాబాద్ లోని సినీ ప్రముఖుల, బుల్లితెర నటుల ఇళ్ళపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఐటీ అధికారులు కమేడియన్ బ్రహ్మానందం, బుల్లితెర నటులు ఉదయభాను, సుమ, ఝాన్సీ, ఓంకార్, గాయనీ సునీత, గీతామాధురి ఇళ్ళతో పాటు సినీ ప్రముఖుల ఇళ్ళపై సోదాలు నిర్వహించారు. Link : http://www.apherald.com/Movies/ViewArticle/9830/   ‘గబ్బర్ సింగ్’ డబుల్ సెంచరీ..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబుల్ సెంచరీ కొట్టాడు. ‘గబ్బర్ సింగ్' చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. Link : http://www.apherald.com/Movies/ViewArticle/9598/   26/11 భావోద్వేగాల్ని ఆవిష్కరించిన వర్మ వందలాదిమందిని పొట్టనపెట్టుకొని వేలాది కుటుంబాలను విషాదంలో ముంచి యావద్భారతాన్ని వణికించిన సంఘటన ముంబైపై ఉగ్రవాద దాడి. మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ మారణహోమాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. సినిమా ట్రైలర్ ను విడుదల చేశాడు. Link : http://www.apherald.com/Movies/ViewArticle/9489/   తుపాకీ సరికొత్త రికార్డు..! విజయ్-కాజల్ హీరోగా మురుగదాసు తెరకెక్కించిన ‘తుపాకి' చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ చిత్రం కలెక్షన్ల పరంగా 100 కోట్లు దాటింది. Link : http://www.apherald.com/Movies/ViewArticle/9482/ మన జక్కన్నను గెలిపించండి..! టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళిని గెలిపించే అవకాశం ఆయన అభిమానులకు వచ్చింది. ఇటీవల రాజమౌళి 'సీఎన్ఎన్-ఐబీఎన్ ఇండియా-2012' అవార్డుకు నామినేట్ అయ్యాడు. అయితే రాజమౌళికి ఈ అవార్డు దక్కడం దక్కక పోవడం అంతా మన చేతుల్లోనే ఉంది. Link : http://www.apherald.com/Movies/ViewArticle/9721/

మరింత సమాచారం తెలుసుకోండి: