‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకలో దర్శకుడు నినాయక్ రామ్ చరణ్ పై విలక్షణ కామెంట్స్ చేసాడు. చరణ్ తన హుందా ప్రవర్తనతో అతడితో సినిమాలు తీసేవారికి మెగా పవర్ స్టార్ గా కాకుండా ‘రాయల్ చరణ్’ గా కనిపిస్తాడు అంటూ చరణ్ పై ప్రశంసలు కురిపించి రామ్ చరణ్ కు కొత్త ట్యాగ్ ను ఇచ్చాడు వినాయక్. అంతేకాదు ‘చరణ్ బార్న్ విత్ గోల్డెన్ హార్ట్’ ఆకాశానికి ఎత్తేశాడు వినాయక్. 

ఈ పొగడ్తలతో వినాయక్ మెగా కుటుంబ భజన చేస్తున్న నేపధ్యంలో చిరంజీవితో తాను చేయబోతున్న150వ సినిమా గురించి ఏమైనా లీక్ వినాయక్ ఇస్తాడేమో అని అందరూ ఆశక్తిగా ఎదురు చూసారు. అయితే వినాయక్ ఈవిషయమై డైరెక్ట్ గా ఏమి చెప్పకపోయినా చిరంజీవి ‘బ్రూస్ లీ’ షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు తాను స్వయంగా షూటింగ్ స్పాట్ కు వెళ్ళి చిరంజీవిని చూశానని అక్కడ ‘కత్తి’ లాంటి చిరంజీవి లుక్ తనకు కనిపించింది అని అంటూ చిరంజీవి వైపు చూసినప్పుడు చిరంజీవి నవ్వుతూ వినాయక్ వైపు చూస్తూ నవ్వులు కలపడంతో వారిరువురు త్వరలో ‘కత్తి’ కోసం కలవబోతున్నారు అన్న సంకేతాలు ఇచ్చాడు చిరంజీవి.

అయితే చిరంజీవి తన స్పీచ్ లో తన 150వ సినిమా గురించి ప్రస్తావన తీసుకు వస్తూ కథ దొరకలేదు అని చెప్పను కాని తన 150వ సినిమా గురించి మరో 15 రోజుల లోపు అధికారక ప్రకటన ఉంటుంది అని చెప్పడంతో చిరంజీవి తన 150వ సినిమా గురించి సస్పెన్స్ కొనసాగిస్తున్నాడనే అనిపించింది.

ఈ కార్యక్రమ యాంకర్ సుమ అల్లుఅరవింద్ తో మీరు చిరంజీవితో ఎప్పుడు సినిమా తీస్తారు అని ప్రశ్నించినప్పుడు చిరంజీవి నటించబోయే 151వ సినిమా తన బ్యానర్ లోనే ఉంటుంది అని లీక్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్ తో తాను తీస్తాను అంటూ చిరంజీవి 151వ సినిమా గురించి కూడ క్లారిటీ ఇచ్చేసాడు అరవింద్. దీనితో మరో 15 రోజుల పాటు చిరంజీవి తన సస్పెన్స్ ను కొనసాగిస్తున్నాడు అంటూ సెటైర్లు పడ్డాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: