తెలుగు ఇండస్ట్రీలోకి చిరంజీవి తనయుడిగా ‘చిరుత’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయిన రాంచరణ్..తీసినవి కొన్ని సినిమాలే అయినా 40 కోట్ల క్లబ్ లో చేరి హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న బ్రూస్ లీ చిత్రాన్ని 37కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్ర ఆడియో వేడుకలు అట్టహాసంగా జరిగాయి..  టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి విచ్చేశారు.  ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి చిరంజీవి కుటుంబసమేతంగా హాజరయ్యారు. సెలవు రోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. అన్నిపాటలు అందరినీ అలరించేవిగా ఉంటాయని, శ్రీనువైట్ల జన్మదినం సందర్భంగా విడుదల చేసి లే ఛలో పాటకు 6 లక్షల హిట్స్ రావడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు థమన్.

ఇక ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అనే వార్తలు గుప్పుమన్నాయి.  ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ ఐటెం సాంగ్ కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉన్నారు. షరా మామూలే..ఈ సారి కూడా మెగా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు పవన్.. ఆ మద్య చిరంజీవి 60 సంవత్సరాల వేడుక గచ్చి బౌలి వేదికలో నాగబాబు పవన్ కళ్యాణ్ ఫాన్స్ పై మండిపడిన విషయం తెలిసిందే. అయితే తర్వాత చిరంజీవి ని కలిసి పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘బ్రూస్ లీ’ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్ లోని నోవటెల్ లో అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆడియోని విడుదల చేశారు.

‘బ్రూస్ లీ’ ఆడియో ఆవిష్కరణ


శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘బ్రూస్ లీ’ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించగా ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా చిరంజీవి తనయున్ని భలే పొగిడారు.. రామ్ చరణ్ లోని స్టైల్, డాన్స్ చూస్తుంటే నన్ను నేను తెరపైన చూసుకున్నట్లు ఉంటుందని, ఈ చిత్రంలో తన పాత్ర ఒక పసందైన భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకున్నట్లు ఉంటుందని’ ఆయన తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసాడు. అదే విధంగా తన 150 వ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే అభిమానులకు తెలియజేస్తామని, ఆ చిత్రానికి రామ్ చరణ్ మరియు తన సతీమణి సురేఖలు నిర్మాతలుగా వ్యవహరిస్తారని చిరు తెలియజేసారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: