తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన బ్రూస్ లీ మూవీ ఆడియో ఫంక్షన్, హైటెక్స్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ముందుగానే అందరూ భావించినట్టుగా “బ్రూస్ లీ” ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. “బ్రూస్ లీ” ఆడియో ఫంక్షన్ లో చిరు ఇచ్చిన లాంగ్ స్పీచ్ తో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.


అయితే ఇదే స్పీచ్ లో “బ్రూస్ లీ” మూవీకి సంబంధించిన స్టోరీ ఏమై ఉంటుందా? అనే అభిమానుల ఆసక్తికి తెరదించేశాడు చిరంజీవి. “బ్రూస్ లీ” ఫైటర్ గురించి చెబుతూనే, దాని ద్వారా వచ్చిన “బ్రూస్ లీ” మూవీ టైటిల్, టైటిల్ వెనుక ఉన్న కథ ఏంటో వివరంగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే “బ్రూస్ లీ” మూవీకి సంబందించిన స్టోరీ బయటకు లీక్ అయింది. ఆ తరువాత తాజాగా చిరంజీవి చెప్పిన మరింత స్టోరీకి ఇది జతకావడంతో “బ్రూస్ లీ” కథ పూర్తిగా బయటకు వచ్చిందని అంటున్నారు.


ఇక బయటకు వినిపిస్తున్న “బ్రూస్ లీ” స్టోరీని చూస్తే “ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఉన్నకథలో ఓ పెద్ద గొడవ, దాని కోసం పోరాడే హీరో. అన్నా చెల్లలి సెంటిమెంట్ గా సాగుతున్న ఈ చిత్రంలో, చెల్లలి జీవితంలో ఎదరయ్యే ఇబ్బందులన్ని అన్నగా చరణ్ ఏ విధంగా సాల్వ్ చేశాడన్నదే పూర్తీ కథాంశం” అని అంటున్నారు.


మొత్తంగా ప్రస్తుతం “బ్రూస్ లీ” కథమై ఓ క్లారిటి వచ్చిందనీ, కానీ ఈ మూవీలో చరణ్ చేసిన ఫైట్స్, చిరు ఇంట్రడక్షన్ వంటివి చాడాల్సిందేనని అభిమానులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: