తన రాజకీయ ప్రత్యర్ధులను తన మాటల తూటాలతో ఇరుకున పెడుతూ కామెంట్స్  చేసే పవన్ కళ్యాణ్ సిగ్గు పడిన సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కన్నడ హీరోయిన్ లక్ష్మిరాయ్ ముందు పవన్ సిగ్గుపడుతూ నటిస్తున్న ఫోటోలు నేటిరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 

ఇప్పటివరకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పై వచ్చిన రూమర్స్ ను పక్కన పెట్టి పవన్ తన సినిమాను స్పీడ్ పెంచాడు అన్న విషయానికి సాక్షoగా ఈ స్టిల్స్ కనిపిస్తున్నాయి. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ స్పాట్ నుండి ఈఫోటోలు వెబ్ మీడియాకు లీక్ అవ్వడంతో ఈ ఫోటోలను పవన్ అభిమానులు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ హడావిడి చేస్తున్నారు.

ఈ ఐటెమ్ సాంగ్ లో శాండిల్‌వుడ్ బ్యూటీ లక్ష్మీరాయ్‌ పవన్ తో ఇరగదీసే స్టెప్స్ వేసిందని యూనిట్ టాక్. పవన్ ఖాకీ డ్రెస్‌, నెక్‌కి రెడ్ టవల్, చేతికి గుబాలించే మల్లెలతో పక్కా మాస్ లుక్ లో కనిపించి తన అభిమానులలో తన సినిమాపై ఆలోచనలను రెట్టింపుచేస్తున్నాడు. ఇక లక్ష్మీరాయ్ హాట్ లుక్స్ గురించి వేరే చెప్పనవసరంలేదు. 

ప్రస్తుతం  నానక్ రామ్‌గూడ‌లోని రామానాయుడు స్టూడియోలో  ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ అద్భుతంగా వేసిన  సెట్లో ఈపాట షూటింగ్ వేగంగా జరుగుతోంది.  ‘కెవ్వు కేక నా సామిరంగా’ అంటూ
‘గబ్బర్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ చేసిన హంగామాని పవన్ అభిమానులు మర్చిపోలేని నేపధ్యంలో ఆ పాట రేంజ్ ని మించేలా పవన్ ఈ పాటను తీర్చిదిదాలని పట్టుదలగా ఉన్నట్లు టాక్. ఈసినిమా నిర్మాణం అనుకున్న స్పీడ్ గా జరగక పోవడంతో ‘సర్దార్’ సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నా సమ్మర్ రేస్ కు వచ్చి రికార్డులు బ్రేక్ చేస్తుందని పవన్ అభిమానులు ఆశిస్తినున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: