‘శ్రీమంతుడు’ ఘన విజయంతో తనగత వరస పరాజయాల ట్రాక్ నుండి బయటకు వచ్చిన మహేష్ తన భవిష్యత్ సినిమాల ఎంపిక విషయంలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మరో పరాజయం తన సినిమాలను పలకరించకూడదు అన్న అభిప్రాయంతో ఎంతోమంది టాప్ డైరెక్టర్స్ తన ఇంటిముందు క్యూ కడుతున్నా ఎటువంటి ఖంగారు లేకుండా ప్రస్తుతం తాను నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా పై తన దృష్టిని పెట్టి వచ్చే సంవత్సరం సమ్మర్ రేసుకు సిద్ధం అవుతున్నాడు.

అయితే మహేష్ మళ్ళీ మరో తప్పు చేస్తున్నాడు అంటూ ఫిలింనగర్ లో కామెంట్స్ వినపడుతున్నాయి. గతంలో ‘దూకుడు’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత మహేష్ నటించిన తదుపరి సినిమాలు ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ సినిమాల బడ్జెట్ 60 కోట్లు దాటి పోవడంతో ఆ బడ్జెట్ కు తగ్గట్టుగా ఆ సినిమాలు బిజినెస్ అయినా, ఆ సినిమాలు పరాజయం చెందడంతో కొనుక్కున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. దీనితో మహేష్ తన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘శ్రీమంతుడు’ విషయంలో సినిమా బడ్జెట్ పెరిగి పోకుండా జాగ్రత్తలు తీసుకుని 100 కోట్ల సినిమాగా ‘శ్రీమంతుడు’ ని నిలబెట్టాడు.

అయితే ఈ జోష్ లో ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ విషయంలో మహేష్ జరిగి పోయిన గతాన్ని మరిచిపోయి మళ్ళీ తప్పు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. దీనికి కారణం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న శ్రీకాంత్ అడ్డాల కేవలం ఆ సినిమాలోని పెళ్ళి సీన్ కు సంబంధించిన సంగీత్ ఫంక్షన్ సీన్ కోసం చిత్రీకరించిన పాటకు ఒక భారీ సెట్ వేయడమే కాకుండా ఆ పాట కోసం 3.50 కోట్లు ఖర్చు పెట్టడంతో ఈ సినిమా పూర్తి అయ్యేసరికి ఈసినిమా బడ్జెట్ ఏ స్థాయికి చేరిపోతుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో పాటు భారీ తారాగణం అంతా ఈసినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈసినిమాలో నటిస్తున్న రావ్ రమేష్ కు ఏకంగా కోటి రూపాయల భారీ పారితోషికం ఇస్తున్న నేపధ్యంలో ఈసినిమా బడ్జెట్ కూడా 60 కోట్లను దాటే స్థితిలో ఉందని అంటున్నారు. అన్ని సినిమాలు ‘శ్రీమంతుడు’ స్థాయిలో సూపర్ హిట్ కావు కాబట్టి, ఈసినిమాను భారీ రేట్లకు కొంటున్న బయ్యర్లకు ఈ సినిమా విజయంలో ఏదైనా తేడాలు వస్తే వారి పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ వినిపించడమే కాకుండా మహేష్ మళ్ళీ తప్పు చేస్తున్నాడు అంటూ కొందరు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: