ఎనర్జిటిక్ స్టార్ రామ్ దాదాపు 9 సంవత్సరాలుగా సిని ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. దేవదాసు సినిమాలో మనోడి యాక్టింగ్ చూసి మిసైల్ లా పేలుతున్నాడు తొందరగానే స్టార్ హీరో అవుతాడనిపించింది. వెంటనే జగడంతో వాయిలెన్స్ ఫ్యాషన్ అంటున్నాడే.. వాటే ఎనర్జీ అని ఎనరిటిక్ స్టార్ ని చేసేశారు. అయితే ఆ తర్వాత రెడీ, మస్కా హిట్టు కొట్టిన్ రామ్ కందిరీగ యావరేజ్ గా మిగిలింది. ఇక ఆ సినిమా నుండి సినిమాలైతే చేస్తున్నాడు కాని ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలియనట్టుగా ఉంది. లాస్ట్ పండుగ చేస్కో.. ప్రస్తుత శివం ఇలా సినిమాల్లో రామ్ క్యారక్టర్ సేమ్ ఉండటం.. ఇంకా చెప్పాలంటే మొదట్లో కనిపించిన కసి తగ్గిందనే చెప్పాలి.


రొటీన్ స్టోరీకి పరమ రొటీన్ డైలాగులతో ఒకరకంగా రామ్ శివంతో ఆడియెన్స్ ని హింస పెట్టాడని టాక్. కథలో కొత్తదనం కోసం ఏమాత్రం ట్రై చేయకుండా కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం తీసిన సబ్జెక్ట్ నే మళ్లీ తీస్తూ దాదాపు కెరియర్ ఎండింగ్ కి వచ్చేశాడు రామ్. మొదట్లో కనిపించినంత జోష్ కూడా ఇప్పటి సినిమాల్లో కనిపించట్లేదు. ఇక సినిమా సినిమాకు నటుడనే వాడు పరిపక్వత సాధిస్తాడు కాని రామ్ సినిమా సినిమాకు అదే నటనతో బోర్ కొట్టిస్తున్నాడు.


కథలో హీరో కనిపించాలి కాని హీరో కథ కాకుడదు అందుకే స్టార్ హీరోల సైతం రకరకాల పాత్రల్లో రకరకాల క్యారక్టరైజేషన్స్ ట్రై చేస్తారు. కాని రామ్ మాత్రం రెగ్యులర్ యంగ్ బోయ్ క్యారక్టర్ నే ఎంచుకోవడం అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే రామ్ దగ్గర ఈ విషయం ప్రస్థావిస్తే తాను ఎంతో కష్టపడి ప్రయోగంగా తీసిన ఎందుకంటే ప్రేమంట సినిమా ఫ్లాప్ అయ్యింది అందుకే తాను ప్రయోగాలు దూరం అంటున్నాడు. సినిమాలో ప్రయోగాలు ఉన్నా లేకున్నా సినిమా సినిమాకు తన క్యారక్టరైజేషన్లో కూడా తేడా లేకుండా చెండాలం చేస్తున్నాడు.


సోలోగా వచ్చినా రామ్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావితం చూపించలేదని చెప్పాలి. మరి ఇలానే చేసుకుంటూ పోతే తన కెరియర్ అసలకే మోసం వచ్చే పరిస్థితి వచ్చినా రావొచ్చు. ఇకనుండైనా రామ్ జాగ్రత్త పడితే బెటర్ లేదంటే ఇక పెట్టా బేడా సర్ధేయాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: