మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘బ్రూస్ లీ’ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్ లోని నోవటెల్ లో అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆడియోని విడుదల చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘బ్రూస్ లీ’ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించగా ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంగీతం ఎస్ఎస్ థమన్ అందిస్తున్నారు. కాగా దసరా కానుకగా అక్టోబర్ 16 న ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రంపై అందరూ తమ అభిప్రాయాన్ని, శుభాకాంక్షలను తెలిపారు.. కానీ ఒక మాజీ హీరోయిన్ ఇప్పుడు అమ్మ పాత్రలు, అత్త పాత్రలు చేస్తున్న సదియా మాత్రం చిరంజీవికి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన రజినీకాంత్,అబితాబచ్చన్ సమకాలికుడైన చిరంజీవి మంచి క్రేజ్ ఉన్న హీరో..అయినా కూడా నదియా  స్పీచ్ విన్న అందరికీ ఇదే డౌటొచ్చింది.

‘బ్రూస్ లీ’ ఆడియో ఆవిష్కరణ


రాంచరణ్ 'బ్రూస్ లీ ది ఫైటర్' ఆడియో ఫంక్షన్లో పేరుపేరునా యూనిట్ సభ్యులను హీరోని, హీరోయిన్, దర్శకులను,మ్యూజిక్ డైరెక్టర్ ని అందరి గురించి ప్రస్తావించింది.. థాంక్స్, అప్రిషియేట్ చేసిన ఆమె, మాటవరసకైనా మెగాస్టార్ గురించి మాట్లాడలేదేంటి చెప్మా అనుకుంటున్నారు మెగాఫ్యాన్స్. ఇది గమనించిన  యాంకర్ సుమ.. మీరు ఆంటీ పాత్రలుకాదు, హీరోయిన్ గా ఎప్పుడు.. ఎవరితో చేస్తారని ప్రశ్నించింది. దీంతో నదియ,  చిరుపేరు చెబుతుందని అందరూ అనుకున్నారు. కానీ నదియా నోటివెంట అస్సలు మెగాస్టార్ పేరు రాకపోవడంతో స్టేజ్ పై ఉన్న అందరూ ముక్కునవేలేసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: