డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న బ్రూస్ లీ చిత్రాన్ని 37కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్ర ఆడియో వేడుకలు అట్టహాసంగా జరిగాయి..  టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి విచ్చేశారు.  ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి చిరంజీవి కుటుంబసమేతంగా హాజరయ్యారు. సెలవు రోజు కావడంతో అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.

చాలా కాలంగా మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లకు ఆలీ – సుమ ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తున్నారు. అయితే ఈ మద్య ఆలీపై చాలా వివాదాలు వస్తున్నాయి.. సన్నాఫ్ సత్యమూర్తి ఫంక్షన్ లో అయితే.. సుమ – అల్లు అరవింద్ లను ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు ఆలీ. కొన్ని సార్లుగా ఫంక్షన్లలో ఆలీ – సుమ – అరవింద్ ల మధ్య మాటలతో ఫన్నీ ఫైట్లు బాగానే జరుగుతున్నాయి. బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది...ఇక సుమ యాంకరింగ్ తో అందరిలో జోష్ బాగా పెరిగింది.


బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ సుమా, అల్లు అరవింద్


బ్రూస్ లీ ఫంక్షన్ లో ఆలీ లేడు... కానీ సుమకు మాత్రం పంచ్ పడింది..అయితే ఆ పంచ్ వేసింది ఎవరో కాదు.. చిరంజీవి సొంత బావమరిది..స్టార్ ప్రొడ్యూసర్ అల్లూ అరవింద్..అసలు విషయం ఏమిటంటే..అల్లూ అరవింద్ తన బావి చిరంజీవి 151వ సినిమా నేనే తీస్తా అని చెప్పారు.. అప్పుడు సుమ స్పందించి  మిమ్మల్ని ఒకటి అడగాలి అల్లు అరవింద్ గారూ అనగానే.. చిరు పక్కన హీరోయిన్ పాత్ర అడుగుతావేమో అని భయపడ్డా అన్నారు అల్లు. నాకు పోటీగా నదియా ఉన్నారంటూ.. కాస్త కవర్ చేసేందుకు ట్రై చేసినా.. దొరికిపోయినట్లయింది సుమ పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: