బాలీవుడ్ హాట్ క్వీన్ శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ మరోసారి అందరికి షాక్ ఇవ్వబోతుంది. మర్డర్ -2లో ఇమ్రాన్ హష్మితో హద్దులేని రొమాన్స్ చేసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆ సినిమాతోనే బీ టౌన్ ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ అయ్యింది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే రెచ్చిపోయి రొమాన్స్ చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది ఈ డస్కీ బ్యూటీ. చూస్తుంటే ఆ సమయం రానే వచ్చిది అని అనిపిస్తుంది బాలీవుడ్ హాట్ సీక్వెన్స్ మర్డర్ కు మరో పార్ట్ ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు దర్శక నిర్మాతలు.


ఇప్పటికే మూడు భాగాలు వచ్చిన ఈ సినిమా మరో పార్ట్ తెరకెక్కించనున్నారట అయితే ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ జరుగగానే ఆ సినిమాలో ఛాన్స్ వస్తే అసలు వదులుకోనని అంటుంది జాక్వెలిన్. ఇమ్రాన్ హష్మితో ఘాటైన రొమాన్స్ చేసిన జాక్వెలిన్ మర్డర్-2 తో ఓ రేంజ్ కు వెళ్లింది.  మర్డర్ మొదటి భాగమే మల్లిక శెరావత్ తన అందాలతో ముచ్చెంతిందంటే ఆ సీక్వెల్ లో జాక్వెలిన్ మల్లికాను మించి పోయింది. 


మూడో భాగం అంత ప్రేక్షకాదరణ పొందలేదు. ప్రస్తుతం ముఖేష్ భట్ ఈ సినిమా నాలుగో భాగాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట. దీనికి సంబంధించి తనని ఎవరు కన్సల్ట్ కాలేదని ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగితే కాదనకుండా చేసేస్తానని అంటుంది జాక్వేలిన్. మరి ఇన్ని ఆశలు పెట్టుకున్న ఆ మర్డర్ ఛాన్స్ జాక్వెలిన్ కి వస్తుందా అన్నది చెప్పలేం.


ఆల్రెడీ చూసిన అందాన్ని మళ్లీ చూడాలంటే బీ టౌన్ ఆడియెన్స్ కి బోర్ అందుకే మర్డర్ నాలుగో పార్ట్ కు మరో కొత్త భామని వెతికే ప్రయత్నంలో ఉన్నారట చిత్ర యూనిట్. సో మొత్తానికి జాక్వెలిన్ ఆశలు నెరవేరుతాయా లేదా అన్నరి కొద్దిరోజుల్లో తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: