అదేంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా పోస్టర్స్ మాత్రమే కదా ఇప్పటివరకు వచ్చింది మరి ఎన్టీఆర్ టీజర్ ని మహేష్ ఎలా నచ్చాడని సందేహం రావొచ్చు. సుకుమార్ రైటింగ్స్ పతాకంలో డైరక్టర్ సుకుమార్ నిర్మాతగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుమారి 21ఎఫ్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అదరగొట్టిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, హీబా పటేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. అయితే నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత ఆ సినిమా టీజర్ రిలీజ్ చేయించాడు సుకుమార్. సుకుమార్ సినిమా అంటే దేవి మ్యూజిక్ ఉండాల్సిందే అందుకే ఈ సినిమాలో దేవి మార్క్ మ్యూజిక్ ఉండబోతుంది. అయితే ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఈ టీజర్ మహేష్ ని బాగా ఇంప్రెస్ చేసిందట. అందుకే ఆ టీజర్ గురించి తన మాటల్లో పొగుడుతూ సుకుమార్ కు అతని టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు సూపర్ స్టార్ మహేష్.


రత్నవేలు కెమెరా పనితనం గురించి కూడా ప్రస్తావించాడు మహేష్ టీజర్లో సినిమా చూపించారని కొనియాడారు. శ్రీమంతుడు సక్సెస్ జోష్ మీదున్న మహేష్ మొన్నామధ్య సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్లో రిలీజ్ అయిన హీరో సినిమా గురించి కూడా పరిశ్రమకు మంచి నటులను ఇచ్చినందుకు థాంక్స్ అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు కుమారి 21ఎఫ్ గురించి కూడా ట్రైలర్ చూసి మెచ్చుకున్నాడు.
స్వతహాగా మితభాషి అయిన మహేష్ తన చిన్న సందేషాన్ని ట్విట్టర్లో అందించి సినిమా ప్రమోషన్ కి ఎంతగానో ఉపయోగపడేలా చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ అయితే సుకుమార్ ఫ్లాప్ తీసినా అందరు ఆయన్ను గౌరవిస్తారని.. సుక్కు సినిమా ఫ్లాప్ ఎందుకయ్యిందా అని మళ్లీ మళ్లీ చూస్తారని అన్నాడు.
ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకోనున్న నాన్నకు ప్రేమతో సినిమా కొద్ది రోజులు గ్యాప్ తో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తుంది. మరి మహేష్ ఇంప్రెషన్ చూస్తుంటే ఎన్టీఆర్  టీజర్నే అప్రిషియేట్ చేసినట్టుగా ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: