చిరంజీవి  తన  150 వసినిమా కథగా ‘కత్తి’ రీమేక్ కు పచ్చ జండా ఊపడంతో ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపపధ్యంలో ఈ సినిమా రీమేక్ కు కు సంభందించి హీరోయిన్ ఎంపిక విషయమై మెగా కాంపౌండ్ లోఈమధ్య జరిగిన చర్చలలో రెజీనా ప్రస్తావన వచ్చినట్లుగా వార్తలు రావడం అందరికీ షాక్ ఇస్తున్నాయి. 

చిరూ నోటి వెంట రెజీనా హీరోయిన్ గా అయితే ఎలా ఉంటుంది ? అన్న మాటలు వచ్చినట్లు టాక్. దీనికి కారణం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అని అంటున్నారు. ఈసినిమాలో రెజీనా సాయి ధరమ్ తేజ్ లు నటించిన చిరంజీవి టాప్ హిట్ సాంగ్ ‘గువ్వా గోరింకతో’ రీమిక్స్ సాంగ్ లో రెజీనా కనపరిచిన గ్రేజ్ తో పాటు ఆ పాటలో ఆమె వేసిన స్టెప్స్ చిరంజీవికి బాగా నచ్చాయి అని టాక్. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ డేట్స్ దొరకడం కష్టంగా ఉన్న నేపధ్యంలో రెజీనా అయితే చిరంజీవి డేట్స్ తో సహకరిస్తూ ఎన్ని బల్క్ డేట్స్ కావాలి అంటే అన్ని కాల్ షీట్స్ ఇస్తుంది కాబట్టి ఆ దృష్టిలో చిరూ నోటివెంట రెజీనా ప్రస్తావన వచ్చింది అని అంటున్నారు.

అయితే కేవలం ఇది సంభాషణలో వచ్చిన ప్రస్తావనే అయినా ఇటువంటి ప్రస్తావనలో రెజీనా పేరు రావడం ప్రస్తుతం ఆమె క్రేజ్ కు నిదర్శనం అని అంటున్నారు. ఇప్పటికే మెగా హీరోయిన్ గా ముద్ర వేయిoచుకున్న రెజీనా నిజంగానే ఇటువంటి అదృస్టాన్ని పొందగలిగితే రెజీనా టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈవార్తలు ఇలా ఉండగా చిరంజీవి 150వ సినిమాగా ‘కత్తి’ రీమేక్ కు సంబంధించి ఈ సినిమాను కోలీవుడ్ లో నిర్మించిన నిర్మాతల నుండి ఇంకా పూర్తి అనుమతి రాలేదు అని అంటున్నారు. దీనికి కారణం ఈ సినిమాను ‘ఠాగూర్’ మధు కేవలం డబ్బింగ్ రైట్స్ కోసమే కొన్న నేపధ్యంలో ఇప్పుడు ఈ సినిమాను రీమక్ గా మార్చాలి అంటే కత్తి సినిమాను నిర్మించిన కోలీవుడ్ నిర్మాతల అనుమతి అవసరం అని అంటున్నారు. ఈకారణాల వల్లనే ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకలో చిరంజీవి ఈసినిమా పై స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు ఇదే ఫంక్షన్ లో మీడియా వర్గాలు ఎన్ని సార్లు ప్రశ్నించినా వినాయక్ సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరగడం అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: