త శుక్రు వారం జరిగిన ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ పోస్టర్ కు అవమానం జరిగింది అంటూ పవన్ అభిమానులు గగ్గోలు పెడుతూ ఆ పోస్టర్ ఫోటోలను వెబ్ మీడియాలో పెట్టి ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. ఇక వివరాలలోకి వెళితే పవన్ పోస్టర్లు ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుక జరిగిన ప్రాంగణ ప్రాంతంలో కింద పడి ఉండటం ఈ రచ్చకు కారణం అయింది అని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఈ ఆడియో వేడుకకు వస్తాడని ఎటువంటి అధికారక ప్రకటన లేకపోయినా పవన్ ఫోటోతో ‘బ్రూస్ లీ’ టీమ్ ముద్రిoచిన పోస్టర్లు ఆడియో వేడుక ప్రాంగణంలో కొంత సేపు హడావిడి చేసాయి. అయితే ఈ ఆడియో ఫంక్షన్ మొదలైన తరువాత ఈ పోస్టర్లను తొలగించడమే కాకుండా ఆ హడావిడిలో అక్కడక్కడ కింద పడేసినట్లు తెలుస్తోంది.

అయితే పవన్ వీరాభిమానులు కొందరు కిందపడి ఉన్న ఆ పోస్టర్ల ఫోటోలను తమ సెల్స్ తో ఫోటోలు తీసి పవన్ కు అవమానం జరిగింది అంటూ వెబ్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. ఈ రచ్చ విషయం ఎలా ఉన్నా పవన్ ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకకు చివరి నిముషం వరకు వస్తానని ఆఖరి నిముషంలో ట్విస్ట్ ఇచ్చాడా అనే అనుమానం కలగడం సహజం.

కానీ బయట పవన్ పోస్టర్లను చూసి కూడ మెగా అభిమానులు ఎవ్వరూ ‘బ్రూస్ లీ’ ఆడియో ఫoక్షన్ లో ఎటువంటి పవన్ ప్రస్తావన తీసుకు రాకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనితో ఈపోస్టర్స్ నిజంగా ‘బ్రూస్ లీ’ ఆడియో ఫంక్షన్ లో పెట్టినవేనా ? లేదంటే ఎవరైనా రచ్చ చేయడానికి వెబ్ మీడియాలో ఇలా క్రియేట్ చేసి వదిలారా? అన్నదే ప్రశ్న..  



మరింత సమాచారం తెలుసుకోండి: