బాహుబలి’ ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేయడమే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో విదేశీ సినిమాలతో పోటీ పడుతూ రాజమౌళి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళి పోతోంది. లేటెస్ట్ గా కొరియాలో జరిగిన బుసన్ ఫిలిం ఫెస్టివల్ లో ‘బాహుబలి’ ప్రత్యేక ప్రదర్శనను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో వేసారు. ఈ సినిమాను చూసిన కోరియన్స్ కు ‘బాహుబలి’ విపరీతంగా నచ్చడంతో ఆ సినిమా పై కొరియన్ సినిమా రంగ ప్రముఖులు ప్రశంసలు కురిపించడమే కాకుండా ప్రస్తుతం ఈసినిమా కొరియా మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

ఈ విషయంలో కోరియన్స్ ఉత్సాహం ఇంతటితో ఆగకుండా ‘బాహుబలి’ సినిమా ప్రదర్శన పూర్తి అయిన తరువాత రాజమౌళిని చుట్టుముట్టి రెండు ప్రశ్నలతో రాజమౌళిని ఉక్కిరిబిక్కిరి చేసారని టాక్. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తన ట్విటర్ లో తన ట్విట్ ద్వారా తెలియచేసాడు. ‘బాహుబలి’ సెకండ్ పార్ట్ విడుదల ఎప్పుడు ? కట్టప్ప ‘బాహుబలి’ ని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నలతో కోరియన్స్ కూడ రాజమౌళిని వెంటాడినట్లు తెలుస్తోంది.

దీనితో షాక్ అయిన రాజమౌళి కట్టప్ప సమస్య ఈసినిమాను చూసిన ఇండియన్స్ నుండే కాకుండా కోరియన్స్ నుండి కూడ తనకు ఎదురవ్వడం పెద్ద సమస్యగా మారింది అంటూ ట్విట్ చేసాడు. ఒకవైపు రాజమౌళి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ తన ‘బాహుబలి’ ని ప్రపంచానికి చూపెడుతూ ఆసినిమా క్రేజ్ ను పెంచుతూ ఉంటే ‘బాహుబలి 2’ షూటింగ్ విషయమై ఇంకా స్పష్టమైన క్లారిటీ రావడంలేదు. 

ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘బాహుబలి 2’ కథ విషయమై రాజమౌళికి స్పష్టమైన క్లారిటీ వచ్చినా ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా నెమ్మదిగా జరుగుతూ ఉండటంతో ఈసినిమా షూటింగ్ డిసెంబర్ లో కాని మొదలుకాదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దేశాలు దాటిపోయినా రాజమౌళిని కట్టప్ప వదలడం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: