తెలుగు ఇండస్ట్రీలోకి వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ‘దేవదాసు’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా. తన నడుం అందంతో కుర్రకారు మతులు పోగొడుతూ..  అగ్రహీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.. మొదట టాలీవుడ్ లో వరుస విజయాలు దక్కించుకొని,  ఇలియానా తరువాత బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ బర్ఫీ తో మంచి నటనను కనిబరిచి విమర్శకుల ప్రసంశలు అందుకుంది.. తర్వాత వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తా పడ్డాయి. దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.  

ఇప్పుడు  అందాల భామ ఇలియానా పంట పడింది. ఏకంగా హాలీవుడ్ లోనే ఛాన్స్ కొట్టేసింది ఈ గోవా బ్యూటీ . అదీ జాకీ చాన్ సరసన కావడం మరో విశేషం. జాకీ చాన్ ఇటివలే “కుంఫూ యోగా” అనే  చేసాడు. మొదట దీంట్లో కత్రినాని అనుకున్నా , డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం తో ఇలియానా ని తీసుకోవాలని అనుకుంటున్నారట నిర్మాతలు .స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ఇలియానా హాట్ అందాలు..


ఇలియానా కూడా త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్లో జాయిన్ కానున్నారట. ఇక ఇప్పటికే నటుడు సోనూసూధ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, తాజాగా ఇలియానా హీరోయిన్గా చేయనుండడంతో కుంగ్ ఫూ యోగా ప్రాజెక్ట్ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించనుందని, జాకీ పర్యవేక్షణలో ఆమెకు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయని సమాచారం. గతంలో ది మిత్ చిత్రంలో మల్లికా షరావత్ ని తీసుకున్నట్లుగానే ఇప్పుడు ఆమెను తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: