తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హై ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మూవీ పులి. స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ నటించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం, కోలీవుడ్ బాక్సాపీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది.   అయితే పులి మూవీకి మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. కోలీవుడ్ మీడియా, పేపర్ సైతం పులి మూవీపై నెగటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తుంది.


దీంతో రంగంలోకి దిగిన  చిత్ర యూనిట్, ఎవరెవరు..ఏ ఏ మీడియాలు ఈ తరహా నెగిటివ్ రిపోర్ట్స్ ని తయారుచేస్తున్నాయో ఓ గంటలో రిపోర్ట్స్ ని హీరో ముందు పెట్టారు. ఇంకే ముందు హీరో నిర్మాతకి అదేశాలను జారీ చేశారు. మూవీకి ఎక్కడా నెగిటివ్ పబ్లిసిటి ఉండకూడదని చెప్పుకొచ్చాడంట. వెంటనే నిర్మాత తన పనులను రాత్రికి రాత్రే చక్కబెట్టేశాడు. మొదటి రోజు మూవీ బాగోలేదంటూ చెప్పుకొచ్చిన మీడియా, తెల్లారికే మాటలను మార్చేసింది.


కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పులి తరహా మూవీ ఓ ప్రయోగం, ఓ అద్భుతం అంటూ చెప్పుకొచింది. దీంతో ప్రేక్షకులు సైతం ఒక్కసారిగా అవాక్యయ్యావుతున్నారు. ఈ వ్యవహారం వెనుక.. హీరో ఆదేశాలను అనుసరించిన  నిర్మాత, రివ్యూవర్స్ ని లక్షల్లో కొనటమే కారణం అంట. అయితే మనీ అందని నిరాశ వర్గం మరొకటి ఉంటుంది కదా. వీరు మాత్రం జరిగిన విషయాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళుతుంది.


మొత్తంగా మూవీ ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే, ఈ మనీ వ్యవహారమే హాట్ టాక్స్ వినిపిస్తుంది కోలీవుడ్ లో. ఇప్పటి వరకూ పులి మూవీ కోలీవుడ్ లో 45 కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. పులి మూవీలో చూపించిన విజువల్స్ చాలా బాగున్నాయని, అయితే మూవీకి స్టోరీనే మైనస్ కావటంతో, ప్రేక్షకులు స్టోరీకి కనెక్ట్ కాలేకపోతున్నరనేది సర్వత్రా వినిపిస్తున్న ఓపెన్ టాక్స్.  



మరింత సమాచారం తెలుసుకోండి: